దావూద్, హఫీజ్ సయ్యద్‌లను చంపాలి : రాందేవ్ బాబా
ప్రపంచం శాంతి కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌లను చంపేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా అన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
ప్రపంచం శాంతి కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌లను చంపేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా అన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే.
ఈ పరిస్థితులపై రాందేవ్ బాబా స్పందిస్తూ... సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు ఇచ్చామని, మన తదుపరి లక్ష్యం కరుడుగట్టిన ఉగ్రవాదులు దావూద్ ఇబ్రహీం, అఫీజ్ సయ్యద్‌లే కావాలన్నారు.
వీరిద్దరిని హతమార్చడం వల్ల ప్రపంచమంతంటా శాంతి నెలకొంటుందన్నారు. భారతీయులంతా విరాళాలు సేకరించి పాకిస్థాన్‌లో విద్య అభివృద్ధికి సహకరిస్తే అక్కడి ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యతే ఉగ్రవాదానికి మూలమన్నారు.