జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలకు పూర్తి హాలిడే ప్రకటించాయి. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
అయితే బ్యాంకుల మూసివేతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం యూపీలో మాత్రమే రామమందిర ప్రాణప్రతిష్ట రోజున బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. మిగతా రాష్ట్రాల్లో యధావిధిగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాగా ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, ఆ రోజున రాష్ట్రాలన్నీ సెలవు ప్రకటించాయని తెలిపారు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదని అన్నారు. దేశమంతా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమ వేడుకలు చేసుకుంటుంటే, ఏపీ ప్రభుత్వ వైఖరి బాధాకరమని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు.