Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడ?

ATM Machine
, మంగళవారం, 11 జులై 2023 (11:09 IST)
ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి అందులోని డబ్బులు చోరీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన కొందరు దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ యంత్రాన్ని ఓ ట్రక్కులో తరలించారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాసిక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో చోరీ చేసేందుకు కొందరు దొంగలు ఏటీఎం సెంటరుకు వచ్చారు. అయితే, ఆ యంత్రం ఎంతకీ బద్ధలు కాకపోవడంతో ఏకంగా ట్రక్కులో ఎక్కించి దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పైగా, సమన్‌గావ్‌ ప్రాంతంలోని ఆర్‌పీఎఫ్‌ శిక్షణ కేంద్రానికి సమీపంలో ఇది జరగడం గమనార్హం. దొంగతనం దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా దొంగలు ఏటీఎంను ఎత్తుకెళ్లే సమయానికి అందులో ఎంత నగదు ఉందన్నదానిపై స్పష్టత రావాల్సివుంది.
 
స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం... చిన్నారి ప్రాణాలు తీసింది...  
 
హైదరాబాద్ నగరంలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. స్కూలు బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ఇంటిముందు ఆడుకుంటున్న ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ కుర్మల్‌గూడ రాజీవ్ గృహకల్పకు చెందిన మిర్యాల వేణుగోపాల్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రెండో కుమార్తె భావన (6) మల్లాపూర్‌లో యూకేజీ చదువుతుంది. సోమవారం పాటశాలకు వెళ్లొచ్చిన సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుంది. బాలాపూప్ర సిస్టర్ నివేదిక పాఠశాల బస్సు డ్రైవర్ లక్ష్మణ్ బస్సును నిర్లక్ష్యంగా నిడపి భావనను ఢీకొట్టాడు. 
 
బస్సు ముందు చక్రం చిన్నారి తలపై నుంచి వెళ్లడంతో ఘోరం జరిగిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను కూడా పట్టుకుని చితకబాదారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు. 
 
నిశ్చితార్థం రద్దయిందనీ... యువతిని చంపేసిన యువకుడు 
 
హర్యానా రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. తనతో జరిగిన నిశ్చితార్థం రద్దు కావడంతో జీర్ణించుకోలేని ఓ యువకుడు.. ఆ యువతిని నిర్దాక్షిణ్యంగా చంచేశాడు. అందరూ చూస్తుండగానే ఆ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి (19)కి నాలుగు నెలల క్రితం రాజ్‌కుమార్ (23) అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థం రద్దు అయింది. దీన్ని రాజ్‌కుమార్ జీర్ణించుకోలేక పోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ యువకుడు... యువతిని హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాదిలో కుంభవృష్టి... ప్రమాద స్థాయిని దాటిన యమునా నది.. ఢిల్లీలో అలెర్ట్