Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో 25మందికి అస్వస్థత.. ఇంటికి పంపించమని విజ్ఞప్తి.. శశికళ నో..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును సినీ నటుడు సుమన్ స్వాగతించారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మాత్రమే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని సుమన్ అభిప్ర

Advertiesment
రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో 25మందికి అస్వస్థత.. ఇంటికి పంపించమని విజ్ఞప్తి.. శశికళ నో..
, బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (10:07 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును సినీ నటుడు సుమన్ స్వాగతించారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మాత్రమే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని సుమన్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. శశికళకు అండగా నిలిచిన చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు గోల్డెన్‌బే రిసార్ట్స్‌లోనే ఉన్నారు. శశికళ ఆదేశాలను శిరసావహిస్తూ జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తున్నారు.
 
మరోవైపు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 25 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమకు ఇంటికి వెళ్లే అవకాశం కల్పించాలని శశికళను వారు కోరారు. శశికళ వారి అభ్యర్థన పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు రిసార్ట్ దాటితే మొదటికే మోసం వస్తుందని శశికళ భావిస్తున్నారు. వారు నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నారా.. లేదా అనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం వర్గంలో చేరేందుకే వారు అనారోగ్యం సాకుతో బయటపడాలని చూస్తున్నారని శశికళ భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీఎస్ఎల్వీ-సీ37తో ఇస్రో కొత్త రికార్డు.. ఏకకాలంలో 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి.. సక్సెస్