Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రా వేసుకుని వున్నావు కదా... అది తీసేసివస్తే అనుమతి.. ‘నీట్‌’లో డ్రెస్‌కోడ్‌ మాటున అధికారుల నిర్వాకం!

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) డ్రెస్ కోడ్ మాటున అధికారుల వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు

Advertiesment
NEET Exam
, మంగళవారం, 9 మే 2017 (10:41 IST)
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) డ్రెస్ కోడ్ మాటున అధికారుల వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్ కోడ్‌తోపాటు లేనిపోని ఆంక్షలను విధించి అమలు చేశారు. 
 
ముఖ్యంగా డ్రెస్‌‌కోడ్‌ నిబంధనల పేరిట అధికారుల వికృత చేష్టల కారణంగా ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రంలోకి వస్తుండగా మెటల్‌ డిటెక్టర్‌ నుంచి బీప్‌ శబ్దం వచ్చింది. ఆ వెంటనే ఆ యువతిని అధికారులు అడ్డుకున్నారు. ఆమెను ఆపాదమస్తకం తనిఖీ చేశారు. నిర్దేశించిన విధంగానే ఆమె డ్రెస్‌కోడ్‌ నిబంధన పూర్తిగా పాటించింది. చెవులకు దుద్దులు, ముక్కు పుడక కూడా తీసేసింది. అయినా అమెను అధికారులు లోపలికి వదల్లేదు.
 
'బ్రా వేసుకుని వున్నావు కదా.. అది విప్పేసి రా... అలా అయితేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తాం' అని స్పష్టం చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం కన్నూర్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో చోటుచేసుకుంది. కాగా అధికారుల తీరుపై విద్యార్థిని తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన కేరళ అసెంబ్లీని కుదిపేసింది. దీనిపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సి.రవీంద్రనాథ్‌ హామీ ఇచ్చారు. కాగా డ్రెస్‌ కోడ్‌ పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేశారని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత సైనికుల తలలు తెగనరికిన పాక్ జవాన్ల తలలు నరికితే రూ.5 కోట్లు : ముస్లిం సంస్థ వెల్లడి