Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఐ యాం సారీ మామ్‌’.. 'ఐ యాం సారీ డాడ్' : సోష‌ల్ మీడియాలో జోకులే జోకులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాకు విపక్ష పార్టీలన్నీ తుడిచిపెట్టుకుని పోయాయి. మొత్తం 403 సీట్లకుగాను బీజేపీ ఏకంగా 310 స

Advertiesment
Assembly Election results 2017
, శనివారం, 11 మార్చి 2017 (15:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాకు విపక్ష పార్టీలన్నీ తుడిచిపెట్టుకుని పోయాయి. మొత్తం 403 సీట్లకుగాను బీజేపీ ఏకంగా 310 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంతో విజయభేరీ మోగించనుంది. ఈ ఓటమితో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 
 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం అఖిలేష్ త‌న తండ్రికి "ఐ యాం సారీ డాడ్" అని చెబుతున్న‌ట్లు, రాహుల్ గాంధీ త‌న త‌ల్లికి "ఐ యాం సారీ మ‌ామ్" అని చెబుతున్న‌ట్లు వ‌చ్చి ఓ పోస్టు విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. మా పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ ఓడించ‌లేదు. 
 
మరోవైపు ఎస్పీని రాహుల్ గాంధీ ఓడించాడు అంటూ అఖిలేష్ యాద‌వ్ ప్లకార్డులు ప‌ట్టుకున్న‌ట్లు ప‌లువురు పోస్టులు చేస్తున్నారు. గుజరాత్ గాడిదలు అని కొందరు అన్నారని, అయితే, గాడిదలే బలంగా మిమ్మల్ని తన్నాయా? అని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు. 
 
మరోవైపు.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీ శక్తిని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయాయి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి జీర్ణించుకోలేని అపజయాన్ని తెచ్చిపెట్టాయి. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా బీజేపీని యూపీలో అధికారంలోకి రాకుండా చేయాలనుకున్న రాహుల్ ఆశలు పటాపంచలయ్యాయి. 
 
ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవమే మిగిలింది. బీజేపీకి ఈ కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయింది. మరోవైపు రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలు పీడకలగా నిలిచిపోనున్నాయి. ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఈ ఎన్నికలతో పూర్తిగా మంటగలిసింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆయన గెలిపించుకోలేక పోయారు. ఫలితంగా మోడీ ముందు ఆయన పూర్తిగా వెలవెలబోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌ది ఐరెన్ లెగ్... ఓటమిని అంగీకరించిన అఖిలేష్... ములాయం వర్గం ఫైర్