Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసోంలో కాంగ్రెస్‌కు చెంపదెబ్బ... బీజేపీకి తొలిసారి అందలం.. సీఎంగా శరబానంద్

Advertiesment
Assam election results
, గురువారం, 19 మే 2016 (12:14 IST)
అసోం రాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి గట్టి చెంపదెబ్బ కొట్టారు. ఫలితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 
 
మొత్తం 126 అసెంబ్లీ సీట్లున్న అసోం రాష్ట్ర శాసనభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి రికార్డు స్థాయిలో 72 సీట్లలో ఆధిక్యాన్ని సాధించగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేవలం 30 సీట్లకు, ఏఐయుడీఎఫ్ అభ్యర్థులు 15 చోట్ల, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
కాగా, గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తరుణ్ గగోయ్, బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి శరబానంద్ సోనావాల్‌లు పోటీపడుతుండగా, వీరిలో శరబానంద్ విజయంవైపు పయనిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్క‌రాల కోసం రోడ్ల సుందరీక‌ర‌ణ‌కు రూ.28 కోట్లు!