Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానసిక వికలాంగురాలిపై ఖాకీ రేప్.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని.. తిరుగుతున్న వాహనంలోనే?

దేశంలో ఢిల్లీ, యూపీలకు తర్వాత మహిళలపై అఘాయిత్యాలకు బెంగళూరు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఐటీ రాజధాని అయిన బెంగళూరులో మహిళలకు భద్రత కరువైంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజ

Advertiesment
ASI held in Tumakuru on charge of raping woman
, సోమవారం, 16 జనవరి 2017 (16:24 IST)
దేశంలో ఢిల్లీ, యూపీలకు తర్వాత మహిళలపై అఘాయిత్యాలకు బెంగళూరు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఐటీ రాజధాని అయిన బెంగళూరులో మహిళలకు భద్రత కరువైంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రక్షణ కల్పించాల్సిన ఖాకీ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించిన పోలీసు అధికారి గస్తీ తిరుగుతున్న వాహనంలోనే మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తుమకూరులోని అంతరసనహళ్ళిలో బాధితురాలు (31) తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నది. ఒక చిన్నవిషయంపై కుటుంబ సభ్యులతో అలిగిన ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. 
 
శనివారం రాత్రి రహదారి పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె పక్కన పోలీసు గస్తీ వాహనం వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్తున్నావని తుమకూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఉమేష్, గస్తీ వాహనం డ్రైవర్ (పోలీసు) ఆమెను అడిగారు. ఇంటి నుంచి అలిగి వచ్చేశానని బాధితురాలు చెప్పడంతో.. ఇలా చేయకూడదని.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి వాహనంలో ఎక్కించుకున్నారు. 
 
అంతే దారిలో గస్తీ తిరుగుతున్న వాహనంలోనే పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తరువాత బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో  ఏఎస్ఐ ఉమేష్, గస్తీ వాహనం డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు. 
 
ప్రాథమిక విచారణలో ఏఎస్ఐ ఉమేష్ ఒక్కడే బాధితురాలిపై అత్యాచారం చేశాడని గుర్తించామని తుమకూరు జిల్లా ఎస్పీ ఇషా పంత్ తెలిపారు. అత్యాచారం చెయ్యడానికి ఉపయోగించిన జీపు పోలీసు శాఖది కాదని, అది ప్రైవేట్ వాహనం అని పోలీసు అధికారులు సమర్థించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా జిల్లాలో చిరంజీవి- వంగవీటి ఫ్లెక్సీల ధ్వంసం.. కారణం ఏమిటి?