Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నువ్వు వెన్నలా ఉన్నావు. నీ బుగ్గలు కశ్మీర్‌ యాపిల్స్‌లా ఉన్నాయి': ఎయిమ్స్‌ నర్సుపై ఆశారాం వ్యాఖ్యలు

'చింత చచ్చినా పులుపు చావలేద'న్న చందంగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు నోటిదూల మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న ఈయన... తాజాగా అఖిల భారత వ

Advertiesment
Asaram Bapu does it again
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (08:21 IST)
'చింత చచ్చినా పులుపు చావలేద'న్న చందంగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు నోటిదూల మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న ఈయన... తాజాగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విధులు నిర్వహించే ఓ నర్పుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఆశారాం బాపు.. బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకోగా, ఇది సుప్రీంకోర్టు పరిశీలనకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
చికిత్స నిమిత్తం ఆశారాంను పోలీసులు శనివారం ఢిల్లీకి తీసుకువచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన పోలీసుల సాయంతో వీల్‌ చైర్‌లో ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వచ్చిన ఆయన అక్కడి నర్సుపై... "నువ్వు వెన్నలా ఉన్నావు. నీ బుగ్గలు కశ్మీర్‌ యాపిల్స్‌లా ఉన్నాయి" అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదండోయ్.. అక్కడి వైద్యులతో తాను యువకుడిగా మారేలా చికిత్స చేయాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోట‌స్‌లో రేవ్ పార్టీ... చిత్రీకరించిన విలేకరిపై దాడి