అసదుద్దీన్ ఓవైసీ ఓ జాతి వ్యతిరేకి : సుబ్రమణ్యస్వామి వ్యాఖ్య
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఓ జాతి వ్యతిరేకి అని మండిపడ్డారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఓ జాతి వ్యతిరేకి అని మండిపడ్డారు.
'ఇండియా టుడే మైండ్ రాక్స్ 2016' చర్చాగోష్టిలో పాల్గొన్న స్వామి మాట్లాడుతూ 'అసద్ ద్రోహి అని నేను అనను. కానీ ఆయన జాతి వ్యతిరేకి. జాతికి విద్రోహి..' అని విమర్శించారు.
దీనిపై అసదుద్దీన్ స్పందించారు. 'స్వామి వంటి వ్యక్తి.. నేను జాతి వ్యతిరేకి అని సర్టిఫికెట్ ఇస్తే.. భద్రంగా దాచుకుంటాను..' అని అన్నారు. 'దేశంలో హిందుత్వ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న వారందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయాలని చూస్తున్నారని, సావర్కర్, గోల్వాల్కర్‌ల సిద్ధాంతాలు ఆమోదం కాదని అసదుద్దీన్ అన్నారు.