Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివాజీ సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారు.. మోడీ వారి మాట ఎందుకెత్తలేదు: ఓవైసీ

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల శివాజీ స్మారకస్థూపానికి

Advertiesment
Asaduddin Owaisi Begins BMC Campaign by Hitting Out at PM Modi
, సోమవారం, 2 జనవరి 2017 (11:35 IST)
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల శివాజీ స్మారకస్థూపానికి ప్ర‌ధాని మోడీ భూమిపూజ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్ర‌సంగంలో భాగంగా శివాజీ సైన్యంలో సేవలు అందించిన ముస్లింల గురించి మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిట‌ని అడిగారు. 
 
శివాజీ మెమోరియల్ కోసం రూ.3,600 కోట్లను వినియోగించ‌డంపై త‌మ అభ్యంత‌రం లేద‌ని, కానీ.. శివాజీ గొప్పతనం గురించిన మాట్లాడిన మోడీ ముస్లింల గురించి ఎందుకు ప్రస్తావించలేదని తెలిపారు. శివాజీ సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారని, శివాజీ కోసం పలువురు ముస్లింలు ప్రాణాలు కూడా ప్రాణాలు కోల్పోయార‌ని ఓవైసీ గుర్తు చేశారు. శివాజీ ఎన్నడూ రైతుల భూములను లాక్కోలేదని ఓవైసీ అన్నారు. 
 
అందుకే శివాజీ అంటే ప్రజలకి ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడే గ‌నుక ఆయ‌న‌ బతికి ఉంటే తన పేరును వినియోగిస్తూ  ప్రజాధనాన్ని వృధాగా ఖ‌ర్చుపెడుతున్న వారిని వదలబోరని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలంతా మంచి దారిలో నడిస్తే 2017 బాగుటుంది.. లేకుంటే : పోప్ ఏమంటున్నారు