Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కపిల్ మిశ్రాపై కేజ్రీవాల్ భార్య ఫైర్.. మా ఇంటికి ఎప్పుడొచ్చావ్..? అతనో నయవంచకుడు..

ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రాపై అరవింద్ కేజ్రీవాల్ సతీమణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్‌పై రోజురోజుకూ స్వరం పెంచుతున్న కపిల్ మిశ్రాపై సునీత ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరి

కపిల్ మిశ్రాపై కేజ్రీవాల్ భార్య ఫైర్.. మా ఇంటికి ఎప్పుడొచ్చావ్..? అతనో నయవంచకుడు..
, సోమవారం, 15 మే 2017 (15:02 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రాపై అరవింద్ కేజ్రీవాల్ సతీమణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్‌పై రోజురోజుకూ స్వరం పెంచుతున్న కపిల్ మిశ్రాపై సునీత ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. కపిల్ మిశ్రా చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. మే ఐదో తేదీన మా ఇంటికి ఎప్పుడొచ్చావని ప్రశఅనించారు. ఎప్పటి మాదిరిగానే మిశ్రాకు కప్పు టీ అయినా ఇచ్చారో లేదో కూడా తనకు తెలియదన్నారు. 
 
కపిల్ మిశ్రా ఓ నయవంచకుడని.. అతడు చేసే ప్రతి ఆరోపణకి తప్పకుండా శిక్ష అనుభవిస్తాడని సునీత మండిపడ్డారు. ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పు చేయదని , విద్రోహ విత్తనాలు, అసత్యపు ఆరోపణలు విత్తినందుకు కపిల్ మిశ్రా తగిన ఫలితం అనుభవిస్తాడని సునీత శాపనార్థాలు పెట్టారు. అయితే మిశ్రా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భర్త అదృష్టం క్షీణిస్తుండటంతో సునీత కేజ్రవాల్‌కి బెంగపెట్టుకుందన్నారు. తన ఆరోపణల వెనుక గల నిజాలేంటో ఆమెకు తెలియదన్నారు.
 
ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మిశ్రా దీక్ష చేపట్టి ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయని కపిల్ మిశ్రా ఆరోపించారు. యాక్సిస్ బ్యాంక్ ద్వారా కేజ్రీవాల్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పేర్కొన్నారు. 
 
ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు లెక్కలు సమర్పించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలను చూపారు. ఈ సందర్భంగా కపిల్ మిశ్రా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సహచరులు ఆయన హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తన భర్త ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తే ఆప్ నేతల అవినీతికి సంబంధించిన కీలక ఆధారాలను తానే సీబీఐకి అందజేస్తానని మిశ్రా భార్య ప్రీతి మిశ్రా తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికానే టార్గెట్.. క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. హ్వాసంగ్-12 పేరిట?