Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం చాలా బాగుంది: తిహార్ జైలు అధికారులు

kejriwal

వరుణ్

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (07:19 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో జ్యూడీషియల్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని తిహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. పైగా, ఆయన ఒక కేజీ బరువు పెరిగారని చెప్పారు. అదేసమయంలో ఆయన షుగర్ లెవల్స్ కూడా నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు అధికారులు కీలక ప్రకటన చేసారు. కేజ్రీవాల్‌కు ప్రతి రోజూ డయాబెటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, షుగర్ లెవల్స్ నిలకడగా ఉన్నాయని చెప్పారు. కేజ్రీవాల్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీన కేజ్రీవాల్ బరువు 65 కిలోలుగా ఉండగా, ప్రస్తుతం ఆయన 66 కేజీలకు చేరుకున్నారని తెలిపారు. అందువల్ల ఆయన ఆరోగ్యం చాలా బాగుందని తెలిపారు.
 
మరోవైపు, ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాలు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో బుధవారం చుక్కెదురైంది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి కోరుతూ కేజ్రివాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదివరకు వారానికి రెండుసార్లు న్యాయవాదులను కలిసేందుకు కేజీవాల్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఐదుసార్లు అనుమతి కావాలని కేజీవాల్ కోరిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ స్పెషల్ జడ్జి తోసిపుచ్చారు.
 
కేజీవాల్ వారానికి రెండుసార్లు కలిసేందుకు అవకాశమిస్తే దానిని న్యాయవాదులతో లిటిగేషన్ వ్యూహాలను చర్చించేందుకు ఉపయోగించకుండా, జలమంత్రికి ఆదేశాలు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 'వ్యాజ్యాలను చర్చించడం కోసం వారానికి రెండుసార్లు అనుమతి ఇస్తే... ఈ సమయంలో వాటిపైనే న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు చెప్పడంలో కేజ్రివాల్ విఫలమయ్యార'ని కోర్టు పేర్కొంది.
 
రెండుసార్లు లీగల్ ఇష్యూపై చర్చించేందుకు అవకాశమిస్తే వాటిని కేజీవాల్ వినియోగించుకోవడం లేదని, ఇతర ప్రయోజనాల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారని, అందుకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ అంశంలో కేజ్రివాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం ఎంతవరకు వచ్చింది అంటే అంబటి డ్యాన్స్ వేస్తారు: పవన్ కల్యాణ్