Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎంను చేయండి.. 8 లక్షల ఉద్యోగాలిస్తా : అరవింద్ కేజ్రీవాల్

Advertiesment
Arvind Kejriwal promises overhaul of higher education
, సోమవారం, 17 నవంబరు 2014 (11:18 IST)
మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే కొత్తగా 8 లక్షల ఉద్యోగాలిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఉన్నత విద్య, విద్యా రుణాలు ఇవ్వడమే కాకుండా వైఫై సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. 
 
నగరంలోని జంతర్ మంతర్ వద్ద ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించి హామీల వరదకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఓట్లేసి అధికారం కట్టబెడితే 8 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాక అన్ని గ్రామాల్లో మెరుగైన క్రీడా వసతులను కల్పిస్తామని కూడా ఆయన ప్రకటించారు.
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే. అయితే, ప్రజలిచ్చిన అధికారాన్ని కాలరాసి, ఏడాది తిరగకముందే మళ్లీ ఎన్నికలకు ఈ పార్టీనే కారణమైంది. ఢిల్లీ అసెంబ్లీ జన్ లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం తెలుపలేదన్న కోపంతో సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu