Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ రూ.1000 నోట్లు.. ఫుల్ సెక్యూరిటీతోనే విడుదల చేస్తాం: అరుణ్ జైట్లీ

దేశంలో మళ్లీ వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లు రానున్నాయి. గత మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. అయితే, ఇందులో రూ.500 నోట్లను కొత్త సిరీస్‌లో అందుబాటులోకి తెచ్చారు. కానీ, రూ.10

Advertiesment
Arun Jaitley
, గురువారం, 10 నవంబరు 2016 (12:30 IST)
దేశంలో మళ్లీ వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లు రానున్నాయి. గత మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. అయితే, ఇందులో రూ.500 నోట్లను కొత్త సిరీస్‌లో అందుబాటులోకి తెచ్చారు. కానీ, రూ.1000 నోట్లను మాత్రం పూర్తిగా రద్దు చేసినట్టు ప్రకటించారు. వాటి స్థానంలో రూ.2000 నోట్లను తెచ్చారు. 
 
రూ.వెయ్యి నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ... మరిన్ని భద్రతా ప్రమాణాలతో కొత్త వెయ్యి రూపాయల నోటును త్వరలోనే తీసుకొస్తామన్నారు. మరికొద్ది నెలల్లో కొత్త డిజైన్, కొత్త రంగుతో వెయ్యి రూపాయల నోటును అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యాంకుల శాఖ, ఆర్బీఐ అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా కరెన్సీని వెంటనే అందుబాటులోకి తీసుకొస్తామని... ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
సాధారణ పౌరులు కొనుగోళ్లు చేసేందుకు కొద్దిరోజుల పాటు ఇబ్బంది ఎదురైనప్పటికీ... దీర్ఘకాలికంగా దేశానికి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రభుత్వానికి తెలపకుండా భారీ మొత్తంలో డబ్బు పోగేసిన వారిపైనే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజల కొనుగోలు అలవాట్లు ప్రభావితం కాగలవన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీపై అసదుద్ధీన్ ఓవైసీ ఫైర్.. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలట..