Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత ఆరోగ్యం.. ఆరుముగస్వామి కమిషన్‌ నివేదికలో విస్తుపోయే నిజాలు

Advertiesment
జయలలిత ఆరోగ్యం.. ఆరుముగస్వామి కమిషన్‌ నివేదికలో విస్తుపోయే నిజాలు
, ఆదివారం, 23 అక్టోబరు 2022 (11:06 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ నివేదికలో వెల్లడైంది. ఆమె ఆస్పత్రిలో ఉన్న 75 రోజుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా మారిందో వివరంగా ఇచ్చారు. 2016 సెప్టెంబరు 22న రాత్రి 10.25 గంటలకు స్పృహలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారు. 
 
అప్పటికే జ్వరం, హైపర్‌టెన్షన్‌, హైపోథైరాయిడ్‌, మధుమేహం, పేగు సమస్యలకూ చికిత్సలు అందించారు. స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. కమ్యూనిటీ అక్వైర్డ్‌ నిమోనియా, ఎడమ జఠరిక లోపాలున్నట్లు అదేరోజు బయటపడ్డాయి. తన చివరి రోజుల్లో ఆస్పత్రిలో బాధాకరస్థితిలో ఉన్నట్లు తేలింది.
 
సెప్టెంబరు 24న రాత్రి 7.30 ప్రాంతంలో ఛాతీ భాగంలో నొప్పిగా ఉన్నట్లు జయలలిత భావించారు. 26న నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేషన్‌పై నిద్రలేకుండా ఇబ్బందిపడ్డారు. తనకు ఇబ్బందిగా ఉందని వైద్యులకు తెలిపారు. ఈసీజీ తీస్తామంటే ఒప్పుకోలేదు. ఆ తర్వాత గుండె కవాటంలో ఇబ్బంది ఉన్నట్లు టీటీఈలో తేలింది. 
 
కవాట సర్జరీ ముందస్తుగా చేయాలని డాక్టర్‌ రామ్‌గోపాలకృష్ణన్‌ 29న తెలిపారు. రెండ్రోజులపాటు ఊపరితిత్తుల భాగంలో ప్రమాదకర ద్రవాన్ని తీసే ప్లూరనల్‌ ఫ్లూయిడ్‌ ఆస్పిరేషన్‌ నిర్వహించారు.
 
25న జయ కుటుంబీకుల ఆహ్వానం మేరకు యూఎస్‌ఏ నుంచి గుండెజబ్బు వైద్యనిపుణులు సమిన్‌శర్మ వచ్చారు. మరుసటిరోజు గుండె కొట్టుకోవడం తగ్గింది. 
 
జయలలిత అక్టోబరు 19న మాట్లాడారు. 22న సంజ్ఞలకు స్పందించడం మొదలుపెట్టారు. 29న రాత్రి ఆమెకు గుండె కొట్టుకోవడంలో సమతుల్యత లోపించింది. ఛాతీలో తీవ్ర నొప్పిగా ఉందని ఆమె వైద్యులకు చెప్పారు. ఇలా జయలలిత ఆరోగ్యంపై ఆమెకు అందిన చికిత్స, చివరి రోజుల్లో ఆమె పడిన ఇబ్బందులన్నీ ఆరుముగం నివేదికలో వెల్లడి అయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం (video)