Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు
, సోమవారం, 17 మే 2021 (11:53 IST)
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల వెకేష‌న్ బెంచ్ దీనిపై విచార‌ణ చేపట్టింది.
 
రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపిస్తున్నారు. బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని ముకుల్‌ రోహత్గీ కోర్టును కోరారు.
 
ఎంపీని అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి ఆయన వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని చెప్పారు. కేవలం బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారన్నారు.
 
రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. గుంటూరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని రోహత్గీ కోర్టుకు చెప్పారు.
 
కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో రఘురామకృష్ణరాజుకు బైపాస్‌ సర్జరీ జరిగిన విషయాన్ని ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
 
అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినించారు. రమేశ్‌ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలన్న రోహత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు.
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ స్పందిస్తూ.. ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ సికింద్రాబాద్‌లో ఉందని చెప్పగా.. సమీపంలోని ఏపీలో లేదా తెలంగాణలో ఆర్మీ ఆస్పత్రి ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో ఉందని.. అక్కడి నుంచే నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారని ఆదినారాయణరావు తెలిపారు. 
 
ఆంధ్రాలో విశాఖపట్నంలో నేవల్‌ బేస్‌ ఆస్పత్రి ఉందని.. అది కూడా 300 కి.మీ కంటే ఎక్కువ దూరమని వివరించారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్‌ ద్వారా సంబంధిత పత్రాలను పంపించాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్‌ బంగ్లాలో ఉరేసుకున్న మహిళ.. సూసైడ్ నోట్‌లో..?