Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూకాశ్మీర్‌లో ఎవరైనా ఓటు వేయొచ్చు : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటన

telangana voters
, శుక్రవారం, 19 ఆగస్టు 2022 (11:12 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇక నుంచి ఎవరైనా ఓటు వేయొచ్చని ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ అధికారిక ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటనను ఆ రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి.
 
ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటనలో... "భారత పౌరులు ఎవరైనా సరే జమ్మూకాశ్మీర్‌లో నివాసం ఉంటున్నా లేదా పని చేస్తున్నా ఓటరు జాబితాలోకి తమ పేరును నమోదు చేసుకుని, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు" అని పేర్కొన్నారు. 
 
అయితే, దీన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎవరైనా వెళ్లి ఓటు వేయవచ్చంటే.. ఒకే ఓటర్ పలు రాష్ట్రాల్లో ఓటు వేయవచ్చని అనుమతించినట్టుగా ఉందని విమర్శించాయి. 
 
నిజానికి మన దేశ ఎన్నికల నిబంధనల మేరకు పౌరులు దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అలా అని, ఒకటికి మించిన రాష్ట్రాల్లో ఓటు వేయడానికి అనుమతి లేదు. ఒక వ్యక్తి కొత్తగా ఒక రాష్ట్రంలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకుంటే, జాబితాలో చేర్చడానికి ముందు, మరెక్కడైనా అతడి పేరు నమోదై ఉందా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి అధికారులు రికార్డులు తనిఖీ చేస్తారు. ఎక్కడా లేనప్పుడే కోరిన విధంగా నమోదు చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్థిరంగా బంగారం ధరలు... తగ్గిన వెండి ధర