తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇపుడు తమిళనాడులో రాజకీయ వేడి మొదలైంది. డిసెంబర్ 31న పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అలాగే, జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని చెప్పారు. అంతే.. రాష్ట్రంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది.
తమిళనాడు రాజకీయ నేతలు తమ ఆటను స్టార్ట్ చేశారని అంటున్నారు. 2018లో తూత్తూకూడిలో జరిగిన స్టైరిలైట్ ఫైరింగ్ ఘటనకు సంబంధించిన కమీషన్ రజినీకాంత్‌కు సమన్లను జారీ చేసినట్లు సమాచారం. స్టెరిలైట్‌కు వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు అది హింసాత్మకంగా మారింది. అప్పుడు జరిగిన పోలీస్ పైరింగ్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రిటైర్డ్ జడ్జీ అరుణ్ జగదీశన్ ఆధ్వర్యంలో కమీషన్ విచారణ జరుపుతోంది.
అప్పట్లో రజనీకాంత్ తూత్తుకూడిని ఘటనలో పోలీసుల చర్యను ఖండించారు. అయితే తూత్తుకూడిని సందర్శించిన తర్వాత తన వ్యాఖ్యలను మార్చుకున్నారు. వ్యాఖ్యలు మార్చుకున్నందుకు రజినీ విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన మార్చుకున్న తన వ్యాఖ్యలపైనే నిలబడ్డారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించిన సమన్లు అందుకున్నప్పటికీ రజినీకాంత్ వ్యక్తిగత మినహాయింపు కోరుకున్నారు. మధ్యలో కోవిడ్ కారణంగా విచారణ మందగించింది. ఇప్పుడు మళ్లీ విచారణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంల రజినీకాంత్‌కు మరోసారి సమన్లు అందుకున్నారు. మరి ఈసారి తలైవా ఏం చేస్తారో చూడాలి.