Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాసలీలల వీడియోలో ట్విస్ట్... అసలు సూత్రధారులు ఎవరో చెప్తా?

రాసలీలల వీడియోలో ట్విస్ట్... అసలు సూత్రధారులు ఎవరో చెప్తా?
, శనివారం, 27 మార్చి 2021 (09:46 IST)
రాసలీలల వీడియో వెనుక ఉన్న అసలు సూత్రధారిని బయటపెడతానని కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోలి చెప్పారు. గత కొన్ని రోజులుగా సీడీల గురించి చర్చ జరుగుతోందని.. ఇంకా అలాంటి 10 సీడీలు రిలీజ్ చేసినా తాను భయపడేది లేదన్నారు. తాను కూడా సాక్ష్యాలు సేకరించానని.. సరైన సమయంలో సీడీల వెనకున్నదెవరో చెబుతానన్నారు. 
 
తప్పు చేసిన వారిని వదిలిపెట్టనన్నారు. తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. న్యాయవాది సూచనల మేరకు ఈ కేసు గురించి తాను ఎక్కువగా మాట్లాడలేనన్నారు. కొన్ని రోజుల క్రితం రమేష్ ఓ యువతితో చనువుగా ఉన్న రాసలీలల వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో రమేశ్ తన మంత్రి పదవికి రాజీనమా చేశారు.
 
ఇదిలావుంటే, నెల రోజులుగా కర్ణాటకను కుదిపేసిన రాసలీల సీడీ వివాదం‌లో శుక్రవారం మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళిపై కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాసలీలల సీడీ యువతి మూడో వీడియోను విడుదల చేశారు. తానుఅజ్ఞాతంలో ఉన్నానని, న్యాయవాది ద్వారా కమిషనర్‌కు ఫిర్యాదు లేఖను పంపుతున్నానని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు. 
 
అడ్వొకేట్‌ కేఎన్‌ జగదీశ్‌కుమార్‌ మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు యువతి ఫిర్యాదు లేఖ అందించారు. ఆ వెంటనే రమేశ్‌ జార్కిహొళిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాజా పరిణా మాలపై బీజేపీ ఘాటుగా స్పందిం చింది. ఆ తర్వాత కాసేపటికే యువతి పేరిట విడుదలైన ఆడియోలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌ పేరు ప్రస్తావించటం కలకలం రేపుతోంది. 
 
కాగా, ‘సమస్య వచ్చింది. ఎదుర్కొంటా, భయపడను అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. రేపటి నుంచే నా అస్త్రాలు వదులుతా’ అని రమేష్‌ జార్కిహొళి సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత తమపై కుట్ర మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలితో కలిసి భార్యను చంపేసిన భర్త.. ఎక్కడ?