Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజరంలో అమ్మాయి నగ్న ఫోటో... కేంద్రమంత్రి వ్యాఖ్యలపై 'దంగల్' గర్ల్ రివర్స్...

కొన్ని రకాల పెయింటింగ్స్ ఆకట్టుకుంటుంటాయి. వాటిని చూసినప్పుడు ఏవో భావాలు కదలాడుతుంటాయి. కేంద్రమంత్రి విజయ్ గోయల్ ఢిల్లీలో జరిగిన ది ఇండియా ఆర్ట్ ఫెస్టివల్‌లో ఓ చిత్రాన్ని చూసి దానిపై ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో బుర్ఖా(హిజాబ్) ధరించిన ఓ య

Advertiesment
పంజరంలో అమ్మాయి నగ్న ఫోటో... కేంద్రమంత్రి వ్యాఖ్యలపై 'దంగల్' గర్ల్ రివర్స్...
, శుక్రవారం, 20 జనవరి 2017 (20:15 IST)
కొన్ని రకాల పెయింటింగ్స్ ఆకట్టుకుంటుంటాయి. వాటిని చూసినప్పుడు ఏవో భావాలు కదలాడుతుంటాయి. కేంద్రమంత్రి విజయ్ గోయల్  ఢిల్లీలో జరిగిన ది ఇండియా ఆర్ట్ ఫెస్టివల్‌లో ఓ చిత్రాన్ని చూసి దానిపై ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో బుర్ఖా(హిజాబ్) ధరించిన ఓ యువతి, ఆ పక్కనే మరో యువతి నగ్నంగా వున్నది. ఆ చిత్రంపై వ్యాఖ్యానిస్తూ... ఈ చిత్రాన్ని చూస్తుంటే 'దంగల్' నటి జైరా వసీం గుర్తుకొస్తోంది. పంజరాన్ని పగులగొట్టుకుని మన ఆడపిల్లలు ప్రగతిపథంలో పయనిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. 
 
ఐతే ట్వీట్ చూసిన వెంటనే జైరా స్పందిస్తూ, హిజాబ్ వేసుకున్న అమ్మాయిలే అందంగా స్వేచ్ఛగా వుంటారంటూనే మీరు పోస్ట్ చేసిన అమ్మాయిలకు, తనకు ఎలాంటి పోలికలు లేవని తెలిపింది. దీనికి మంత్రిగారు మళ్లీ స్పందిస్తూ... నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నిన్ను పొగిడాను. పురుషాధిక్య అభిప్రాయాలు మారాలని ట్వీట్ చేశాను. నా వ్యాఖ్యలను అర్థం చేసుకోలేకపోవడం బాధాకరం అంటూ ట్వీట్ చేశారు. దీనిపై జైరా స్పందిస్తూ... ఇలాంటి చిత్రాలపై వ్యాఖ్యలు చేస్తూ నన్ను ఉటంకించవద్దనీ, అసలు తనపై వ్యాఖ్యలు చేయవద్దన్నట్లు ట్వీట్ చేసింది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మగాడికి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్... నో కాంపిటీషన్... అంతా కలిసే...