Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13 యేళ్ళ బాలికపై యేడాదిన్నరగా 8 మంది ఉపాధ్యాయుల అత్యాచారం...!

తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలను విద్యపరంగా తీర్చిదిద్దేది గురువే కాబట్టి. అయితే అలాంటి గురువులే సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు.

13 యేళ్ళ బాలికపై యేడాదిన్నరగా 8 మంది ఉపాధ్యాయుల అత్యాచారం...!
, ఆదివారం, 26 మార్చి 2017 (11:35 IST)
తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలను విద్యపరంగా తీర్చిదిద్దేది గురువే కాబట్టి. అయితే అలాంటి గురువులే సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. తమ పాఠశాలలో చదివే 13 యేళ్ళ బాలికపై యేడాదిన్నర పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి ప్రాణాంతక రక్త క్యాన్సర్ సోకడంతో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. 
 
రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతంలో ఒక కుటుంబం నివసిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలలో 13 యేళ్ళ బాలిక చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికపై కొంతమంది ఉపాధ్యాయుల కన్ను పడింది. 
 
ఒకరు.. కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ఉపాధ్యాయులు. అది కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. చిన్నారి పాఠశాలకు రాగానే ఒకరి తర్వాత ఒకరు ఆమెను నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్ళి తమ కామవాంఛను తీర్చుకునేవారు. ఇది కూడా గత సంవత్సరంగా జరుగుతోంది. విషయం కాస్త సంవత్సరం ముందే తన తల్లిదండ్రులకు బాలిక చెప్పింది. 
 
కానీ ఆ ఉపాధ్యాయులు తల్లిదండ్రులను బెదిరించారు. బయటకు చెబితే ముగ్గురిని చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు ఏమీ చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నారు. అయితే రెండురోజుల క్రితం బాలిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆమెకు కేన్సర్ అని వైద్యులు తెలిపారు. అయితే బాలిక వైద్యులకు ఈ విషయాన్ని కూడా తెలిపింది. వైద్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేశారు కానీ ఇంతవరకు నిందితులను మాత్రం అదుపులోకి తీసుకోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు మంత్రివర్గంలోకి లోకేశ్, అఖిలప్రియ.. మంత్రులుగా పిన్నవయస్కులు