Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయమ్మ లేని తమిళనాడు.. క్యాష్ చేసుకునేందుకు చెన్నైకి అమిత్ షా.. రజనీకి గాలం?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాట ఏర్పడిన రాజకీయ సందిగ్ధతకు తెరపడట్లేదు. ఆర్కే ఎన్నికలు రద్దు కావడంతో తమిళనాట గవర్నర్ పాలన రానుందనే టాక్ వస్తున్న తరుణంల బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా

జయమ్మ లేని తమిళనాడు.. క్యాష్ చేసుకునేందుకు చెన్నైకి అమిత్ షా.. రజనీకి గాలం?
, శనివారం, 15 ఏప్రియల్ 2017 (13:02 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాట ఏర్పడిన రాజకీయ సందిగ్ధతకు తెరపడట్లేదు. ఆర్కే ఎన్నికలు రద్దు కావడంతో తమిళనాట గవర్నర్ పాలన రానుందనే టాక్ వస్తున్న తరుణంల బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు మే పదో తేదీన ఆయన చెన్నైకి రానున్నారు. ఫలితంగా తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసేకునేందుకు అమిత్ షా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  తమిళనాడులో రాజకీయ బలం లేని తరుణంలో బీజేపీ పాగా వేసేందుకు సన్నద్ధమైంది. 
 
ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో కనీసం 15 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ప్రణాళికలు రచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయమైన ఓట్లను సాధించడం అమిత్ షాలో ఉత్సాహాన్ని పెంచింది. ఈసారి ఎక్కువ ఓట్లు సాధించిన 15 స్థానాలను ఎంపిక చేసి, అక్కడ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్‌లను షా నియమించనున్నట్టు సమాచారం.
 
అంతేకాకుండా, నియోజకవర్గం కమిటీలను కూడా ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. మూడు రోజుల పాటు తమిళనాడులో మకాం వేయనున్న అమిత్ షా... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తమిళనాట నాయకత్వం బలంగా ఉండాలని.. ఇందుకోసం ఓ ప్రజాదరణ నేతను కూడా ఎంచుకునే దిశగా అమిత్ షా పావులు కదుపుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బీజేపీలోకి లాగేందుకు అమిత్ షా విశ్వప్రయత్నాలు చేస్తారని టాక్ వస్తోంది. అయితే రజనీకాంత్.. అమిత్ షాకు చిక్కుతారా అనేదే ప్రశ్నార్థకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్ ఐఫోన్ రూ.4000 కట్... లిమిటెడ్ పీరియడ్ ఆఫర్