మహాత్మాగాంధీ కంటే అంబేద్కరే గొప్ప.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
జాతిపిత మహాత్మాగాంధీ కంటే డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని అసదుద్దీన్ కామ
జాతిపిత మహాత్మాగాంధీ కంటే డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని అసదుద్దీన్ కామెంట్ చేశారు. దీనివల్ల సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందని అసదుద్దీన్ అంటున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఉనికి చాటుకున్న ఎంఐఎంను ఉత్తరప్రదేశ్ లోనూ అభివృద్ధి చేయాలని అసదుద్దీన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకు యూపీ ఎన్నికలను అవకాశంగా మలచుకుంటున్నారు. అక్కడ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎంను పోటీకి దింపుతున్నారు అసదుద్దీన్ ఒవైసీ.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ఓవైసీ ఈ కామెంట్స్ చేశారు. సంభాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 'అంబేద్కర్ మహాత్మాగాంధీ కన్నా పెద్ద నాయకుడు. ఆయన లౌకికవాద, వర్గ రహిత రాజ్యాంగం రూపొందించి ఉండకుంటే సమాజంలో అన్యాయాలు మరింత పెరిగిపోయేవని చెప్పుకొచ్చారు.