డోర్‌మ్యాట్‌లకు హిందూ దేవుళ్ళ బొమ్మలు.. వివాదంలో ఆమేజాన్!
ఆన్‌లైన్ ప్రొడెక్ట్ సెల్లింగ్ వెబ్‌సైట్ అమేజాన్ వివాదంలో చిక్కుకుంది. హిందూ మతానికి సంబంధించిన దేవుళ్లు, దేవతల బొమ్మలున్న పలు డోర్‌మ్యాట్ (కాలి పట్ట)లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది.
ఆన్‌లైన్ ప్రొడెక్ట్ సెల్లింగ్ వెబ్‌సైట్ అమేజాన్ వివాదంలో చిక్కుకుంది. హిందూ మతానికి సంబంధించిన దేవుళ్లు, దేవతల బొమ్మలున్న పలు డోర్‌మ్యాట్ (కాలి పట్ట)లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది.
రాక్ బుల్ అనే అంతర్జాతీయ బ్రాండ్ కిచెన్ వేర్‌కు సంబంధించిన పలు వస్తువులను ఆమెజాన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. డోర్‌మ్యాట్(కాలి పట్ట)పై లక్ష్మీదేవి, వినాయకుడు చిత్ర పటాలు ఉన్నవి సేల్స్‌కు ఉంచింది. దీనిపై ఆగ్రహించిన నెటిజన్లు వాటిని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ల ద్వారా పోస్ట్ చేశారు. హ్యాష్ ట్యాగ్‌తో బాయ్‌కాట్ ఆమెజాన్ అంటూ ట్విట్టర్‌లో ఉద్యమం ప్రారంభించారు.
వీటిపై తీవ్ర దుమారంరేగడంతో ఆమెజాన్ ప్రస్తుతం దేవుళ్ల బొమ్మలు ఉన్న డోర్ మ్యాట్‌లను ఆన్‌లైన్ నుంచి తొలగించింది. జీసస్, ఖురాన్‌కు సంబంధించిన చిత్ర పటాలతో కూడిన డోర్ మ్యాట్‌లు ఇందులో ఉన్నాయి. ఆమెజాన్ నుంచి ఎవరు వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం రాత్రి నుంచి ఈ వ్యవహారంపై ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో విరుచుకుపడుతున్నారు. కాళ్ల కింద వాడే డోర్ మాట్‌లపై హిందూ దేవుళ్లను ముద్రించడమేంటని వాటిని అమ్మకానికి సైట్‌లో పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే ముస్లిం మతం పట్ల అలా ప్రవర్తించగలరా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.