Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

అమ్మాయికి ఇష్టమైతే... మైనర్ బాలుడితో సహజీవనం చేయొచ్చు: హైకోర్టు సంచలన తీర్పు

ఓ ప్రేమ జంట విషయంలో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లీడురాని అబ్బాయిని అమ్మాయి ఇష్టపడినపుడు.. అతనితో కలిసి సహజీవనం చేయొచ్చంటూ తీర్పునిచ్చింది. ఆమె 19 ఏళ్ల హిందూ యువతి, 20 ఏళ్ల ముస్లిం యువక

Advertiesment
allahabad court
, మంగళవారం, 29 నవంబరు 2016 (17:34 IST)
ఓ ప్రేమ జంట విషయంలో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లీడురాని అబ్బాయిని అమ్మాయి ఇష్టపడినపుడు.. అతనితో కలిసి సహజీవనం చేయొచ్చంటూ తీర్పునిచ్చింది. ఆమె 19 ఏళ్ల హిందూ యువతి, 20 ఏళ్ల ముస్లిం యువకుడి కేసులో ఈ తరహా తీర్పును అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
గుజరాత్‌లో పాక్‌ సరిహద్దు గ్రామం ధనేరా(బనస్‌కాంత జిల్లా)కు చెందిన ముస్లిం యువకుడు, అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే తరగతి స్నేహితులు. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ అబ్బాయి మైనర్‌ కావడంతో(భారత వివాహ చట్టాల ప్రకారం 21 ఏళ్లు నిండితేగానీ అబ్బాయి పెళ్లికి అర్హుడు) పెళ్లి సాధ్యం కాలేదు.
 
దీంతో ఇద్దరూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌లో పెద్దవాళ్లు ప్రవేశం చేసి.. అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకుపోయారు. చివరికి ఆ అబ్బాయి.. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్‌కాంత్‌ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా, 'నేను ప్రేమించిన వాడితోనే ఉంటాన'ని ఈ కేసు విచారణకు ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం ముందు అమ్మాయి తెగేసి చెప్పింది. 
 
ఇరు పక్షాల వాదనలు ఆలకించిన సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ అఖిల్‌ ఖురేషీ, జస్టిస్‌ బీరేన్‌ వైష్ణవ్‌లు సోమవారం తుది తీర్పు చెప్పారు. 'భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. సహజీవన సంబంధాలు(లివ్‌ ఇన్‌ రిలేషన్స్‌) మెట్రో నగరాలు, పట్టణాల్లోనే మాత్రమే గోచరిస్తాయి. ఈ నేపథ్యంలో ఒక మేజర్‌ అమ్మాయి ఏ ప్రాంతంలో(గ్రామమో, పట్టణమో) ఉంటున్నప్పటికీ ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేం. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేం. దరిమిలా 19 ఏళ్ల అమ్మాయి తనకు ఇష్టమైతే 20 ఏళ్ల యువకుడి(పిటిషనర్)తో కలిసే ఉండొచ్చు(సహజీవనం చెయ్యొచ్చు)' అని తీర్పు సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా అబ్బాయితో అఫిడవిట్‌ దాఖలుచేయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016'': డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌లకు చెక్.. అగ్రస్థానంలో మోడీ