Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో అఖిలేష్‌కు తోడైన రాహుల్: లోకల్ బాయ్స్ వుండగా మోడీ ఎందుకు?

సోషల్ మీడియాలో యూత్‌ను ఆకట్టుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మించిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యూపీ ఎన్నికల్లో తన హవాను కొనసాగించేందుకు పూర్తిస్థాయి ఎన్నికల ప్రచా

Advertiesment
Akhilesh Yadav
, బుధవారం, 1 మార్చి 2017 (14:52 IST)
సోషల్ మీడియాలో యూత్‌ను ఆకట్టుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మించిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యూపీ ఎన్నికల్లో తన హవాను కొనసాగించేందుకు పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్.. గెలుపు సాధించే దిశగా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ మట్టికరిచింది. అదే ఫలితాలు యూపీ ఎన్నికల్లోనూ పునరావృత్తం అవుతాయా అని బీజేపీ నేతలు జడుసుకుంటున్నారు. 
 
ఇందుకు కారణం సోషల్ మీడియాలో యూత్‌ను ఆకట్టుకోవడంలో అఖిలేష్ సఫలం కావడమే. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి తరహాలోనే యూపీలోనూ తమ పార్టీకి విజయం ఖాయమని అఖిలేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. యూపీలో లోకల్ బాయ్స్ పేరుతో అఖిలేష్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. తమకు తాము యూత్ ఐకాన్స్‌గా చెప్పుకుంటున్నారు. 
 
జాయింట్ రోడ్ షోలు నిర్వహిస్తూ.. బీజేపీకి చుక్కలు చూపిస్తున్న ఈ జంటకు సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. యూపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బాగా కలిసొస్తుందని టాక్. ముస్లిం ఓట్లు కూడా చీలవని, అన్ని వర్గాల ఓట్లు అఖిలేష్‌కే పడుతాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలోనూ బీజేపీకి పరాభవం తప్పదని వారు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలవంతంగా సెక్స్ చేయబోయాడు... అందుకే ఆ పని చేశా... ఒప్పుకున్న భార్య