Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇది అత్త శశికళ ప్లానా? దొరికిపోయాం అత్తోయ్? జైలుకు దినకరన్, పట్టుకుంటారా?

పోయిపోయి ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వబోయారంటే రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారయ్యాయో తమిళనాడు రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు నిలువ నీడలేక తమిళ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నగ్నంగా నిరసనలు చేస్తుంటే ఇక్కడ పార్టీ గుర్తు కోసం కోట్ల రూపాయలు కుమ్మరించేంద

ఇది అత్త శశికళ ప్లానా? దొరికిపోయాం అత్తోయ్? జైలుకు దినకరన్, పట్టుకుంటారా?
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (14:40 IST)
పోయిపోయి ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వబోయారంటే రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారయ్యాయో తమిళనాడు రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు నిలువ నీడలేక తమిళ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నగ్నంగా నిరసనలు చేస్తుంటే ఇక్కడ పార్టీ గుర్తు కోసం కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు ప్రయత్నాలు జరిగాయంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేముంది. అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కోసం అటు ఓపీఎస్, ఇటు పళనిస్వామి వర్గాలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపధ్యంలో గుర్తు తమకే దక్కించుకోవాలని టిటివి దినకరన్ ఓ మధ్యవర్తిని పెట్టి ఈసికి 50 కోట్ల రూపాయలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దినకరన్ స్పందిస్తూ... అసలు తను అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదనీ, డబ్బు తీసుకెళ్లి పట్టుబడిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని అంటున్నారు. 
 
ఐతే పోలీసులు మాత్రం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల రీత్యా దినకరన్ హుటాహుటిన బెంగళూరు జైల్లో వున్న అత్త శశికళతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లి చర్చించబోతున్నట్లు సమాచారం.  మరోవైపు శశికళ మేనల్లుడు దినకరన్ దెబ్బతో పళనిస్వామి క్యాంప్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు జారుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండాకుల్ని సొంతం చేసుకుంటాం.. శశి వర్గాన్ని కలుపుకుని పోతాం.. ఓపీఎస్ ప్రకటన