Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్‌కు పెరుగుతున్న మద్దతు.. రామరాజన్, సెంగొట్టువన్, జయసింగ్‌ల చేరిక

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. 20 మంది ఎమ్మెల్యేలు తాము పన్నీర్‌కే మద్దతు ఇస్తామని తేల్చేయగా, శశికళకు చెందిన మన్నార్ గుడి వర్గం సీఎం అభ్యర్థిగా ప్రిసీడియం చైర్మన్ స

Advertiesment
AIADMK MPs
, ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (15:10 IST)
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. 20 మంది ఎమ్మెల్యేలు తాము పన్నీర్‌కే మద్దతు ఇస్తామని తేల్చేయగా, శశికళకు చెందిన మన్నార్ గుడి వర్గం సీఎం అభ్యర్థిగా ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్‌ను ప్రతిపాదిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయినప్పటికీ తాజాగా పన్నీర్ వర్గంలో అన్నాడీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నేత రామరాజన్ చేరిపోయారు. 
 
ఆదివారం ఉదయం చెన్నైలో పన్నీర్ సెల్వాన్ని తన మద్ధతుదారులతో రామరాజన్ కలుసుకుని మద్ధతు ప్రకటించారు. 'అమ్మ' జయలలితకు వీర విధేయుడైన, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకే తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ బాటలో పన్నీర్ నడుచుకుంటున్నారని కొనియాడారు.

ఎంజీఆర్ వారసత్వాన్ని జయ అందిపుచ్చుకున్నట్లుగా, జయ అనంతరం ఆమె రాజకీయ వారసత్వాన్ని పన్నీర్ సెల్వం కొనసాగించాలని నటుడు, మాజీ ఎంపీ రామరాజన్ ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం అన్నాడీఎంకే ఎంపీలు బి. సెంగొట్టువన్, జె. జయసింగ్ చిన్నమ్మ శశికళను కాదని పన్నీర్ సెల్వాన్ని నేరుగా కలిసి తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీర్ వర్సెస్ శశికళ.. లబ్ధి పొందాలనుకుంటున్న డీఎంకే.. స్టాలిన్ సెన్సేషనల్ కామెంట్స్