Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎడప్పాడికి సీఎం పోస్ట్.. చిన్నమ్మకు జైలు... శశికళ వర్గంలో అసమ్మతి

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో ముఖ్యమంత్రి కుర్చీపై ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. కానీ, ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగించాలని భావిం

ఎడప్పాడికి సీఎం పోస్ట్.. చిన్నమ్మకు జైలు... శశికళ వర్గంలో అసమ్మతి
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (08:48 IST)
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో ముఖ్యమంత్రి కుర్చీపై ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. కానీ, ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగించాలని భావించిన శశికళ శరవేగంగా పావులు కదిపి.. తనకు ప్రధాన అనుచరుడుగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. 
 
దీన్ని పలువురు సీనియర్లతో పాటు వన్నియర్ వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, తమను రిసార్టులో బంధించి వుండటం, శశికళ బయటవుండటంతో వారు నోరుమెదపడం లేదు. ఇపుడు అక్రమాస్తుల కేసులో శశికళ బెంగుళూరు జైలుకెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అసమ్మతి నేతలు తిరుగుబాటు చేస్తున్నట్టు సమాచారం. 
 
తమకన్నా జూనియర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో తమను అదృష్టం వరిస్తోందని సెంగోట్టయన్‌, తంగమణి, ఎస్పీ వేలుమణి తదితర సీనియర్‌ నేతలు ఎవరికి వారే గట్టిగా విశ్వసించారు. అయితే ఎడప్పాడి పళనిస్వామి ఎన్నిక కావడం కొందరు నేతలకు రుచించలేదని సమాచారం. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే చిన్నమ్మ వర్గం మళ్లీ చీలిపోయే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీర్‌కు - పళనికి దారేది? గవర్నర్ చేతిలో 'పంచ'తంత్రం