Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి ఎవరో తెలుసా? సీఎం ఓ పన్నీర్ సెల్వం - శశికళకు సన్నిహితుడు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడు జె.శేఖర్ రెడ్డి పేరు ఇపుడు మీడియాలో మార్మోగిపోతోంది. దీనికి కారణం ఆయనతో పాటు.. ఆయన సన్నిహితుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి కోట్లాద

Advertiesment
J Sekhar Reddy House
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (16:39 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడు జె.శేఖర్ రెడ్డి పేరు ఇపుడు మీడియాలో మార్మోగిపోతోంది. దీనికి కారణం ఆయనతో పాటు.. ఆయన సన్నిహితుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకోవడమే. ఈయన నివాసంలో మొత్తం రూ.90 కోట్ల నోట్ల కట్టలు బయటపడగా, అందులో రూ.70 కోట్లు కొత్త కరెన్సీ నోట్లు కావడం గమనార్హం.
 
అయితే, తితిదే పాలక మండలి సభ్యుడిగా ఉన్న జె.శేఖర్ రెడ్డి ఎవరో కాదు.. వేలూరు జిల్లా కాట్పాడికి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామవాసి. తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం, జయలలిత స్నేహితురాలు శశికళ, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావులకు అత్యంత సన్నిహితుడు. వీరి ద్వారానే తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సుమారు రూ. వెయ్యి కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుని పనులు చేస్తున్నారు. వీరి సిఫార్సుతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తితిదే పాలక మండలి సభ్యుడిగా ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఇదిలావుండగా, శేఖర్ రెడ్డి ఇంట్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన విషయం మరువకముందే చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది. ఆదాయపన్నుఅధికారులు శుక్రవారం పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.106 కోట్ల నగదుతో పాటు 127 కేజీల బంగారం పట్టుబడింది. ఇందులో రూ.10 కోట్ల మేర కొత్త నోట్లు కూడా ఉండడం విశేషం. ఒక్కోటి కిలో బరువున్న 127 బంగారపు కడ్డీలు, రూ.96 కోట్ల పాత కరెన్సీ నోట్లు, రూ.10 కోట్ల మేర రూ.2000 కొత్తనోట్లు తమ సోదాల్లో బయటపడినట్టు ఐటీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 
 
ఇటీవల ఆదాయపన్ను అధికారులకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం ఇదే తొలిసారి. శేఖర్ రెడ్డి సహా మరికొందరి కార్యకలాపాలపై నిఘా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ శాఖ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. కాగా పట్టుబడిన కొత్త కరెన్సీకి సంబంధించి కనీసం బ్యాంకు రసీదులు కూడా లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ మార్పిడి కోసం కొందరు సిండికేట్‌గా ఏర్పడినట్టు సమాచారం రావడంతో అధికారులు మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళతో పదేపదే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ...? కారణం అదేనా?