Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళ సీఎం కావడం అసంభవమే... కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే మన్నార్గుడి మాఫియా కథ కంచికే

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుని, కలలుగంటున్న దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ ఆశలు రోజురోజుకూ ఆవిరైపోతున్నాయి. శశికళ కల ఫలించకపోతే ఆమె చుట్టూ ఉన్న మన్నార్గుడి మాఫియా కథ

శశికళ సీఎం కావడం అసంభవమే... కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే మన్నార్గుడి మాఫియా కథ కంచికే
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (08:58 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుని, కలలుగంటున్న దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ ఆశలు రోజురోజుకూ ఆవిరైపోతున్నాయి. శశికళ కల ఫలించకపోతే ఆమె చుట్టూ ఉన్న మన్నార్గుడి మాఫియా కథ బస్టాండ్‌పాలు కావడమే. దీనికితోడు.. తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు మరికొంతకాలం వేచిచూసే ధోరణితో ఉన్నారు. దీంతో శశికళ ఆశలు అడుగంటిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మరోవైపు తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
నిజానికి జయలలిత నమ్మినబంటు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో తమిళనాడులో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎత్తుకు పైయెత్తు.. మలుపు మీద మలుపులతో రాజకీయ చదరంగం సాగుతోంది. క్షణక్షణానికీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 
 
జయలలిత మృతి తర్వాత, ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, జాగ్రత్తగా పావులు కదిపినా, శశికళకు కాలం కలసిరావడం లేదు. ఆమె సీఎం కావడం దాదాపు అసంభవంగా కనిపిస్తోంది. అనేక వైరుధ్యాలున్న శక్తులు సైతం ఒక్కటై ఆమెకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. అధికారం దక్కకుండా అడ్డుగోడలవుతున్నాయి. ఇక కష్టమే. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్టు శశికళ ప్రకటించుకున్నా, అంత బలం లేదని తెలుస్తోంది. దీంతో ఇతర పార్టీల మద్దతు కోసం ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆమెకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. 
 
మరోవైపు డీఎంకే కార్యానిర్వాహకఅధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్‌ రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిశారు. సెల్వం బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని కోరారు. తద్వారా తన మద్దతు ఎవరికో చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి నివేదించిన గవర్నర్‌.. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో స్టాలిన్ గవర్నర్‌ను కలవడంతో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. 
 
దీనికితోడు జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ ఓ నిందితురాలు. ఈ కేసులో సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో ఆమెకు ప్రతికూలంగా తీర్పు వెలువడితే ఇక ఆమె జైలుకు వెళ్లాల్సిందే. ఇదే జరిగితే శశికళతో పాటు.. ఆమె చుట్టూత ఉన్న మన్నార్గుడి మాఫియా కథ కంచికి చేరినట్టే. అంటే బస్టాండ్‌పాలు కావాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ మీ చుట్టమా? ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశారు.. తమిళనాడు సీఎస్, డీజీపీలకు గవర్నర్ చీవాట్లు