Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిల్ ఉంటే.. ఎమ్మెల్యేలను విడిచిపెట్టండి.. శశికళ పోయెస్ గార్డెన్‌లో ఉండే హక్కు లేదు: ఓపీఎస్

రాజకీయ బలం లేకపోయినా.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న మద్దతు పన్నీర్ సెల్వం పట్ల సానుభూతిని పెంచుతోంది. ఈ సానుభూతే శశికళకు వ్యతిరేకంగా ఆయన్ను ధీటుగా నిలబడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ సీఎం

దిల్ ఉంటే.. ఎమ్మెల్యేలను విడిచిపెట్టండి.. శశికళ పోయెస్ గార్డెన్‌లో ఉండే హక్కు లేదు: ఓపీఎస్
, గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:45 IST)
రాజకీయ బలం లేకపోయినా.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న మద్దతు పన్నీర్ సెల్వం పట్ల సానుభూతిని పెంచుతోంది. ఈ సానుభూతే శశికళకు వ్యతిరేకంగా ఆయన్ను ధీటుగా నిలబడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీ సెల్వం శశికళకు సవాల్ విసిరారు.

గవర్నర్ ఎదుట తన బలాన్ని నిరూపించుకుని తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని ధీమా వ్యక్తం చేశారు. శశికళకు ధైర్యముంటే ఎమ్మెల్యేలను బయటకు పంపి, గవర్నర్ ఎదుట బలాన్ని నిరూపణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. గురువారం గవర్నర్ చెన్నైకి రానున్న నేపథ్యంలో శశికళ వర్గంతో పోటీపడేందుకు పన్నీర్ సై అంటున్నారు. 
 
పనిలో పనిగా పోయెస్ గార్డెన్ నుంచి చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న శశికళను అక్కడినుంచి తరిమేస్తానని పన్నీర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎప్పుడూ సున్నిత వ్యాఖ్యలకే పరిమితమయ్యే పన్నీర్ నోట ఇలాంటి పదునైన వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారి. పోయెస్ గార్డెన్‌లో ఉండే హక్కు శశికళకు లేదని, ఆ ఇంటిని అమ్మ స్మారక కేంద్రంగా మారుస్తానని తెలిపారు.

అవినీతి కేసులున్న వ్యక్తుల ప్రవేశంతో పోయిస్ గార్డెన్‌ను శశికళ కుటుంబ సభ్యులు అపవిత్రం చేశారని నిప్పులు చెరిగారు. జయమ్మకు వీరవిధేయురాలిని అని చెప్పుకునే శశికళ.. జయలలితకు ఇష్టం లేకపోయినా.. ఆమె కుటుంబ సభ్యులను పోయెస్ గార్డెన్‌లోకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైకు రానున్న గవర్నర్.. తొలి పిలుపు పన్నీర్‌కే... ఎందుకంటే...