Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోయెస్ గార్డెన్‌లో చిన్నమ్మకు భద్రత పెంపు: 3వారాల్లో దీప రాజకీయ అరంగేట్రంపై ప్రకటన

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత జడ్ ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. జయలలిత ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న కారణంగానే ఆమె ఇంటి వద్ద భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చే

పోయెస్ గార్డెన్‌లో చిన్నమ్మకు భద్రత పెంపు: 3వారాల్లో దీప రాజకీయ అరంగేట్రంపై ప్రకటన
, గురువారం, 5 జనవరి 2017 (09:27 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత జడ్ ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. జయలలిత ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న కారణంగానే ఆమె ఇంటి వద్ద భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారని, ఇక అంత అవసరం లేదని డీఎంకే కోశాధికారి ఎంకె.స్టాలిన్‌ గతంలో అభిప్రాయపడ్డారు. పోలీసు బలగాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేయడం గమనార్హం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ భద్రతా ఏర్పాట్లలో ఉన్న పోలీసు బలగాలను తగ్గించారు. 
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆమె నివసిస్తున్న పోయెస్‌ గార్డెన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడి పోలీసులు పాదచారులను, వాహన చోదకులను తనిఖీ చేసిన తర్వాతనే ఆ మార్గం వైపు అనుమతిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. తన రాజకీయ ప్రవేశం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా ప్రకటించారు. రాజకీయ ప్రవేశంపై మూడువారాల తర్వాతే ప్రకటిస్తానన్నారు. తన అత్త జయలలిత మరణం పట్ల తనకు అనుమానం ఉందన్నారు. ఆమెకు వైద్యశాలలో అందించిన చికిత్స వివరాలను పూర్తి స్థాయిలో బహిర్గతం చేయాలన్నారు.
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీలో అసంతృప్తి వర్గీయులు అనేకమంది దీపా వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమెను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల నుంచి భారీఎత్తున అసంతృప్తి వర్గీయులు దీపా ఇంటి వద్దకు వచ్చి ఆమెను రాజకీయాల్లోకి రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. బుధవారం సేలం, వేలూరు తదితర కొన్ని జిల్లాల నుంచి వచ్చిన వారు ఆమె ఇంటి వద్ద భారీ ఎత్తున మోహరించారు.
 
వారి ఉత్సాహాన్ని చూసి దీపా ఎనలేని ఆనందంలో మునిగిపోయారు. తన ఇంటి పై అంతస్తు నుంచి చేతులూపి వారికి అభివాదం చేశారు. దీపా ప్రసంగించేటప్పుడు జయలలితలాగానే హావభావాలను కనబరచడాన్ని చూసి వారందరూ జేజేలు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో బాలికపై అత్యాచారం.. మాయమాటలు చెప్పి.. పార్కుకు తీసుకెళ్లి?