Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోడీ జిల్లా అహ్మదాబాద్.. ఎందులో ఫస్టో తెలుసా? గ్యాంగ్‌ రేప్‌‌లకు అగ్రస్థానం..

దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా ఆడవారిపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలు దేశ వ్యాప్తంగా కోకొల్లలు జరుగుతూనే వున్నాయి. కానీ గ్

ప్రధాని మోడీ జిల్లా అహ్మదాబాద్.. ఎందులో ఫస్టో తెలుసా? గ్యాంగ్‌ రేప్‌‌లకు అగ్రస్థానం..
, గురువారం, 11 మే 2017 (13:18 IST)
దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా ఆడవారిపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలు దేశ వ్యాప్తంగా కోకొల్లలు జరుగుతూనే వున్నాయి. కానీ గ్యాంగ్ రేప్‌లలో అహ్మదాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా సామూహిక అత్యాచారాలకు అగ్రస్థానంలో ఉండటం వివాదాస్పదమైంది.
 
ఈ ఐదేళ్ల కాలంలో 33 జిల్లాల్లో 29 సామూహిక అత్యాచారాలు నమోదు కాగా.. ఒక్క అహ్మదాబాద్ జిల్లాలోనే 17 గ్యాంగ్ రేప్‌లు జరిగినట్లు గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ తేజశ్రీ పటేల్ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర హోంశాఖ జిల్లాల వారీగా జరిగిన కేసుల వివరాలను బయటపెట్టింది. దీనిపై స్పందించిన తేజశ్రీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. 
 
దీనిపై సామాజిక వేత్త మీనా మాట్లాడుతూ, కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే.. కఠినమైన శిక్షలను అమలుపరుచకతప్పదన్నారు. అలాగే అత్యాచారాలకు పాల్పడే నేరస్తులకు శిక్షలను సత్వరమే విధించాలని.. కేసుల్ని సాగదీయకూడదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో తిరుగుతుందని ప్రేయసిని చంపేశాడు... ఖాకీలకు చిక్కి జైల్లో ప్రియుడి ఆత్మహత్య