Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్బాయిలు ఇక తొందరగా పెళ్లాడవచ్చు..

అబ్బాయిలు ఇక తొందరగా పెళ్లాడవచ్చు..
, గురువారం, 31 అక్టోబరు 2019 (11:22 IST)
అబ్బాయిలు తొందరగా పెళ్లాడవచ్చు. పురుషుల వివాహ వయస్సు 21 ఏళ్లను మూడేళ్లు తగ్గించి అమ్మాయిలతో సమానంగా 18 ఏళ్లు చేయాలని కేంద్రం యోచిస్తోంది. బాల్య వివాహ నిషేధ చట్టంలో సవరణపై ఇటీవల నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. 
 
ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్టు ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలియజేసింది. వివాహం విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు వయసు ఒకేలా వుండాలంటూ ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. 
 
బాల్య వివాహ నిషేధ చట్టానికి సవరణ కోసం మహిళా శిశు అభివృద్ధి శాఖతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు పలు చట్టాలను మార్చాల్సి ఉండడంతో న్యాయశాఖను కూడా కక్షిదారుగా చేర్చాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కుల్లో తాడికొండ ఎమ్మెల్యే?