Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవులను కాపాడిన అక్కాచెల్లెలు...భయంతో పారిపోయిన మృగరాజు

ఆవులను కాపాడుకోవడం కోసం ఇద్దరు యువతులు ఏకంగా మృగరాజుతోనే పోరుకు దిగిన సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. సంతోక్‌ రబరీ(19), మయ్యా(18) అనే అక్కాచెల్లెళ్లు గిర్‌ అభయారణ్యం సమీపంలోని ఒక కుగ్రామంలో నివసిస్తు

Advertiesment
ఆవులను కాపాడిన అక్కాచెల్లెలు...భయంతో పారిపోయిన మృగరాజు
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (12:03 IST)
ఆవులను కాపాడుకోవడం కోసం ఇద్దరు యువతులు ఏకంగా మృగరాజుతోనే పోరుకు దిగిన సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. సంతోక్‌ రబరీ(19), మయ్యా(18) అనే అక్కాచెల్లెళ్లు గిర్‌ అభయారణ్యం సమీపంలోని ఒక కుగ్రామంలో నివసిస్తున్నారు. ప్రఖ్యాత ఆసియాటిక్‌ సింహాలు ఈ అడవిలోనే సంచరిస్తుంటాయి. తండ్రి అనారోగ్యం పాలవడంతో కుటుంబానికి జీవనాధారమైన పశువులను మేపే బాధ్యత కొన్నేళ్లుగా ఈ అక్కాచెల్లెళ్లపై పడింది.
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఆవులను మేపుతుండగా ఆసియాటిక్ సింహం ఒకటి అక్కడికి వచ్చింది. సాధారణంగా సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడి పారిపోతారు. కానీ ఈ సోదరిలు ఏమాత్రం భయపడకుండా అలా ఉండిపోయారు. సింహం బారి నుంచి తమను తాము కాపాడుకోవడమే కాక తమ జీవనాధారమైన ఆవుల ప్రాణాలను కూడా కాపాడాలని నిశ్చయించుకున్నారు. ఆవులను కాపాడేవిషయంలో ప్రాణాలు కోల్పోయిన పర్వాలేదని అనుకున్నారు.
 
దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా, చేతుల్లోని దుడ్డు కర్రలతో సింహానికి ఎదురుగా నిలబడ్డారు. మనోధైర్యంతో ముందుకు వచ్చిన ఆ అక్కాచెల్లెళ్ల ధైర్యం చూసి సింహం ఏమనుకుందో ఏమో కానీ.. వారి మీద దాడి చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, అటవీ సంరక్షణ అధికారులు ఆ బాలికల ధైర్యానికి మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మాయి సంతోక్ మాట్లాడుతూ, ''సింహాలకు వెన్ను చూపిస్తే అవి మనపైన దాడిచేస్తాయి, ధైర్యంగా ముఖాముఖి ఎదురుపడితే ఏం చేయకుండా వెళ్లిపోతాయి'' అని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2017లో నారా బ్ర‌హ్మ‌ణి చక్రం తిప్ప‌బోతున్నారా...?