Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్వానీ భవితవ్యం తేలేది 30న

అద్వానీ భవితవ్యం తేలేది 30న
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:21 IST)
బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరి భవితవ్యం ఈ నెల 30న తేలిపోనుంది. బాబ్రి మసీదు విధ్వంసం కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు ఆ రోజున తీర్పును వెలువరించనుంది.

బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరినీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరారు. 1992 డిసెంబరు 6వ తేదీన అయోధ్యలో 16వ శతాబ్దానికి చెందిన మసీదును కరసేవకులు ధ్వంసం చేశారు.

బాబ్రి మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ప్రభృతులపై నేరపూరితమైన కుట్ర అభియోగాలను ప్రత్యేక సిబిఐ కోర్టు 2017లో నమోదు చేసింది.

అభియోగాలను తొలగిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, 2017లో అద్వానీ ప్రభృతులపై రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేరపూరితమైన కుట్ర అభియోగాలను సుప్రీం కోర్టు పునరుద్ధరించింది.

అద్వానీ, ఇతరులపై అభియోగాలను తొలగించాలని 2001లో ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్ణయాన్ని 2010లో అలహాబాద్‌ హైకోర్టు ధృవీకరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరిహారం ఇస్తాం రండి.. వైసీపీ నేతలకు నకిలీ లేఖలు