Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళతో ఫోనులో మాట్లాడారనీ కారును తగలబెట్టారు..

Advertiesment
శశికళతో ఫోనులో మాట్లాడారనీ కారును తగలబెట్టారు..
, మంగళవారం, 22 జూన్ 2021 (09:34 IST)
అన్నాడీఎంకే బహిష్కృత మహిళా నేత శశికళతో ఫోనులో మాట్లాడారన్న కోపంతో అన్నాడీఎంకే నేత కారును గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటన రామనాథపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. 
 
రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన శశికళ ఇటీవల మళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో టచ్‌లో ఉంటున్నారు. అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
 
ఈ క్రమంలో రామనాథపురం జిల్లా అన్నాడీఎంకే ఎంజీఆర్‌ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్సెంట్‌ రాజాతో శశికళ ఇటీవల ఫోనులో మాట్లాడారు. ఈ ఆడియా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. 
 
దీంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్‌ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. కాగా విన్సెంట్‌ రాజాకు పరమకుడి సమీపంలోని మేలక్కావనూరు గ్రామంలో కాంక్రీట్‌ మిక్సింగ్‌ కంపెనీ ఉంది.
 
ఇక్కడి సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి విధులకు రాలేదు. కంపెనీ ప్రాంగణంలో కారును పార్క్‌ చేసి అక్కడి గదిలో విన్సెంట్‌ రాజా నిద్రించాడు. సోమవారం తెల్లవారుజాము 2.45 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో బయటకు వచ్చి చూశారు. 
 
గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కారుపై పెట్రోలు పోసి తగలబెడుతున్నారు. విన్సెంట్‌ను చూడగానే పారిపోయారు. విన్సెంట్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అన్నాడీఎంకేకు చెందిన నేతలే ఈపనికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితుడి తల తెగనరికి.. సీఎం ఫాంహౌస్‌కు సమీపంలో పూడ్చిపెట్టారు...