Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిత్య ఎల్1 కౌంట్‌డౌన్ ప్రారంభం.. యావత్ ప్రపంచానికీ...

Advertiesment
Adithya 1
, శనివారం, 2 సెప్టెంబరు 2023 (08:50 IST)
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్1 మిషన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం 11.50కు శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఎల్1 లగ్రాంజ్ పాయింట్ వద్ద ఈ ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టనున్నారు. 
 
రాబోయే కాలంలో అంతరిక్షంలో మనవ ప్రయాణాలపై ఈ మిషన్ ఎంతగానో ప్రభావం చూపుతుందని మాజీ ఆస్ట్రోనాట్ క్రిస్ పేర్కొన్నారు. ఇది మానవాళి అంతటికీ ఉపయోగపడే ప్రయోగమని పేర్కొన్నారు. సూర్యుడిపై లోతైన అధ్యయనంతో యావత్ మానవాళిని సౌరు తుఫానుల ప్రతికూల ప్రభావం నుంచి కాపాడవచ్చని వివరించారు. 
 
అంతేగాకుండా.. ఎలక్ట్రికల్, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లను, శాటిలైట్ వ్యవస్థలను కాపాడుకోవచ్చని వెల్లడించారు. ఆదిత్య ఎల్ 1 ద్వారా సేకరించే సమాచారం ఇస్రోకే కాకుండా యావత్ ప్రపంచానికీ కీలకమని క్రిస్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. షాకైన టీటీడీ