Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడదాని మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టాలి: స్నేహ

మలయాళ సినీ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపు, మరో నటి వరలక్ష్మి తనను కూడా ఒక ప్రముఖ టీవీ చానెల్ హెడ్ వేధించారంటూ ఆరోపించిన నేపథ్యంలో ఆడదాని మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టాలి అంటూ సినీ నటి స్నేహ నిప్పులు చెరిగారు.

ఆడదాని మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టాలి: స్నేహ
హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (02:56 IST)
మలయాళ సినీ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపు, మరో నటి వరలక్ష్మి తనను కూడా ఒక ప్రముఖ టీవీ చానెల్ హెడ్ వేధించారంటూ ఆరోపించిన నేపథ్యంలో ఆడదాని మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టాలి అంటూ సినీ నటి స్నేహ నిప్పులు చెరిగారు. వయసులో ఉన్న మహిళలను కాదుకదా పసిపాపలను వేధించడానికి కూడా ఏ మగాడైనా భయపడాలి. అలాంటి ఆలోచన మనసులో రావడానికి కూడా భయపడాలి. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే కఠిన చట్టాలు తీసుకురావాలి అంటూ స్నేహ సోషల్ మీడియాలో రాసిన ఒక లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
నా సహచర నటీమణులు భావన, వరలక్ష్మీలకు ఎదురైన అనుభవాలను తలచుకుంటుంటే నా మనసు తీవ్రంగా ఆవేదన చెందుతోంది. మనస్ఫూర్తిగా వాళ్లకు నా మద్దతు తెలుపుతున్నాను. ధైర్యంగా వాళ్లు మాట్లాడిన తీరుని ప్రశంసిస్తున్నాను. ఇటువంటి ఘటనల గురించి ఓపెన్‌గా హ్యాండిల్‌ చేసిన విధానంలో వాళ్ల  పరిణతి కనిపిస్తోంది.
 
 
మహిళలపై అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం తీసుకోవడానికి ఇంతకు మించిన తరుణం లేదు. మహిళల గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి.. అంతకు ముందు ఉన్నట్టు మేము సురక్షితంగా ఉన్నామని మహిళలు ధైర్యంగా ఉండడానికి పొరాటం చేయవలసిన సమయమిదే. ముఖ్యంగా... పసిపాపలను అబ్యూజ్‌ చేయడానికి కూడా ఏ మగాడైనా భయపడాలి. మనసులో అలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. న్యాయవ్యవస్థను పటిష్టం చేయాలి.
 
నిర్భయ, నందిని, రితిక, హాసిని... ఇంకా ఎంతమంది ఇక ఈ దేశంలో బాధితులు ఉండకూడదు. మాకు న్యాయం కావాలి. మాకు గౌరవం కావాలి. గౌరవంగా బతికే హక్కు కావాలి. మా హక్కులను సాధించుకునే గెలుపు కావాలి. ఈ సందర్భంగా నేనొక చిన్న అడుగు వేస్తున్నాను. చిన్నదే కానీ చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఓ తల్లిగా నేనో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ‘మహిళలను గౌరవంగా చూసేలా.. మహిళల అర్హతకు తగ్గట్టు వాళ్లతో హుందాగా ప్రవర్తించేలా’ నా కుమారుణ్ణి పెంచుతానని అందరికీ మాటిస్తున్నాను.
 
సేలంలో ఐదుగురు వ్యక్తులు కలసి పదేళ్ల అమ్మాయిని వేధించి చంపేశారు. తమిళనాడులో ఏం జరుగుతోంది ప్రతి రోజూ వార్తల్లో ఇలాంటివి కనిపించడం కామన్‌ అవుతుందా దయచేసి ఈ దుర్మార్గాలను ఆపండి.
– స్నేహ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడేళ్ల పసిపాపలపై అత్యాచారాలు.. వాళ్లూ బట్టలు సరిగా వేసుకోలేదా: స్నేహ ఆవేదన