Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రగ్స్ ఇచ్చాడు. పుచ్చుకుంది. డబ్బు ఎగ్గొట్టింది. రూ.6వేల కోసం మర్డర్ చేసేశాడు

మాదక ద్రవ్యాలు అమ్మేవారితో పెట్టుకుంటే పుట్టి మనుగుతుందంటే దానికి తాజా ఉదాహరణ ముంబై సినీ నటి ఉదంతం. డ్రగ్స్‌కు అలవాటు పడిన ముంబై సినీ నటి కృతికా చౌదరి తీసుకున్న మాదకద్రవ్యాలకు గాను ఆరువేల రూపాయలు డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టిందట. అపార్టుమెంటుకు వచ్చి

డ్రగ్స్ ఇచ్చాడు. పుచ్చుకుంది. డబ్బు ఎగ్గొట్టింది. రూ.6వేల కోసం మర్డర్ చేసేశాడు
హైదరాబాద్ , బుధవారం, 12 జులై 2017 (07:11 IST)
మాదక ద్రవ్యాలు అమ్మేవారితో పెట్టుకుంటే పుట్టి మనుగుతుందంటే దానికి తాజా ఉదాహరణ ముంబై సినీ నటి ఉదంతం. డ్రగ్స్‌కు అలవాటు పడిన ముంబై సినీ నటి కృతికా చౌదరి తీసుకున్న మాదకద్రవ్యాలకు గాను ఆరువేల రూపాయలు డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టిందట. అపార్టుమెంటుకు వచ్చి అడిగాడు. ఇవ్వనంది. అంతే.. దగ్గరున్న ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు. తాపీగా వెళ్లిపోయాడు. శవం కుళ్లిపోయి వాసస వస్తే కానీ నాలుగు రోజుల తర్వాత ఆమె హత్యకు గురయినట్లు లోకానికి తెలియదు. 
 
మోడల్, సినీ నటి కృతిక చౌదరి మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. కృతిక మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న డ్రగ్స్ సప్లయర్ షకీల్ నసీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం రూ. 6000 కోసమే ఆమెని హత్యచేసినట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖులకి డ్రగ్స్ సప్లయర్‌గా వ్యవహరిస్తున్న షకీల్ నసీమ్, కృతికకి కూడా క్రెడిట్‌పై డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
 
అయితే, కృతిక తన వద్ద కొనుగోలు చేసిన డ్రగ్స్‌కి బదులుగా ఇవ్వాల్సి వున్న రూ.6,000 మొత్తాన్ని ఇవ్వమని కోరగా ఆమె డబ్బులు ఇవ్వడానికి తిరస్కరించిందని, ఆ కోపంతోనే వెంట తీసుకెళ్లిన ఓ లోహపు వస్తువుతో తలపై బలంగా మోదడంతో ఆమె చనిపోయిందని షకీల్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
 
కృతిక తాను నివాసం వుంటున్న ఇంట్లోనే హత్యకు గురైన ఉదంతం జూన్ 12న వెలుగుచూసింది. కృతిక ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందంటూ ఇరుగుపొరుగు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్లాట్ డోర్ బద్దలుకొట్టి చూసిన పోలీసులకి కుళ్లిపోయిన స్థితిలో వున్న కృతిక మృతదేహం కనిపించిన సంగతి తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకిన్ ఇండియాకు బూస్ట్‌లా జీఎస్టీ : మోడీపై చైనా మీడియా ప్రశంసలు