Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోయంబత్తూర్ సెంట్రల్ జైలులో మావో ఖైదీకి పెన్ డ్రైవ్.. దాన్నిండా బూతు వీడియోలే..

కోయంబత్తూరు సెంట్రల్ జైలు అధికారులు ఓ మావోయిస్టు ఖైదీ వద్ద వుంచుకున్న పెన్ డ్రైవ్ చూసి షాక్ తిన్నారు. ఆ పెన్ డ్రైవ్‌ను సిస్టమ్‌కు కనెక్ట్ చేసి చూసిన జైలు అధికారులు ఖంగుతిన్నారు. జైలులో శిక్ష అనుభవించే

Advertiesment
కోయంబత్తూర్ సెంట్రల్ జైలులో మావో ఖైదీకి పెన్ డ్రైవ్.. దాన్నిండా బూతు వీడియోలే..
, బుధవారం, 14 జూన్ 2017 (18:13 IST)
కోయంబత్తూరు సెంట్రల్ జైలు అధికారులు ఓ మావోయిస్టు ఖైదీ వద్ద వుంచుకున్న పెన్ డ్రైవ్ చూసి షాక్ తిన్నారు. ఆ పెన్ డ్రైవ్‌ను సిస్టమ్‌కు కనెక్ట్ చేసి చూసిన జైలు అధికారులు ఖంగుతిన్నారు. జైలులో శిక్ష అనుభవించే ఓ మావో కోసం ఇద్దరు వ్యక్తులు దుస్తులు తెచ్చారు. కానీ ఆ దుస్తులను అనుమానం మేరకు తనిఖీ చేశారు. ఆ దుస్తుల్లో ఓ పెన్ డ్రైవ్ దొరికింది. ఇదేంటబ్బా.. అనుకుని దాన్ని కంప్యూటర్‌కు పెట్టి ఓపెన్ చేసిన జైలు అధికారులు షాక్ తిన్నారు. కారణం - దాన్నిండా బూతు వీడియోలున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన మావోయిస్టు అనూప్.. కోయంబత్తూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల మరో మావోయిస్టు సీపీ మెయిదీన్ సోదరుడైన సీపీ రషీద్, హరిహర శర్మ అనే మరోవ్యక్తి కలిసి జైలుకు దుస్తులు తీసుకొచ్చారు. వాటిని శిక్ష అనుభవిస్తున్న మావోయిస్టు అనూప్‌కు అందజేయాల్సిందిగా కోరారు. జైలు అధికారులు ఆ దుస్తుల్లో పెన్ డ్రైవ్ కనిపించింది. 
 
ఈ పెన్ డ్రైవ్‌ను కంప్యూటర్‌కు పెట్టి చూడగా దాన్నిండా బూతు వీడియోలు కనిపించాయి. తొలుత అధికారులు షాక్ తిన్నా.. ఆ వీడియో వెనుక ఏదైనా రహస్య సమాచారం ఉందోననే అనుమానంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దుస్తుల పేరుతో పోర్న్ వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొచ్చిన రషీద్, శర్మలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంజారాహిల్స్‌లో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. హత్యా, ఆత్మహత్యా?