Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పది రూపాయల విరాళం.. సైకిల్‌పై ప్రచారం.. ఇరోం షర్మిళ సరికొత్త కేంపెయిన్

పదహారు ఏళ్లపాటు మణిపూర్‌లో ప్రత్యేక భద్రతా దళాలకు ఉన్నప్రత్యేక హక్కులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల చాను ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. సుదీర్ఘ పోరాటానికి గత ఏడాది స్వస్తి పలి

పది రూపాయల విరాళం.. సైకిల్‌పై ప్రచారం.. ఇరోం షర్మిళ సరికొత్త కేంపెయిన్
హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (01:57 IST)
పదహారు ఏళ్లపాటు మణిపూర్‌లో ప్రత్యేక భద్రతా దళాలకు ఉన్నప్రత్యేక హక్కులకు వ్యతిరేకంగా  సుదీర్ఘకాలం  పోరాటం చేసిన ఉక్కు మహిళ  ఇరోమ్ షర్మిల చాను ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. సుదీర్ఘ పోరాటానికి గత ఏడాది  స్వస్తి పలికి రాజకీయనేతగా అవతరించి మణిపూర్ ఎన్నికల్లో  పోటీచేస్తున్న షర్మిల సరికొత్త తీరుతో వ్యవహరిస్తున్నారు.
 
పీపుల్స్‌ రిసర్జెన్స్‌ అండ్ జస్టిస్‌ అలయన్స్‌ (పీఆర్ జేయే) పార్టీతో  ఎన్నికల బరిలో దిగిన ఇరోం ముఖ్యమంత్రి  ఓకరం ఇబోబి సింగ్  ఢీకొంటున్నారు.  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల నేపథ్యంలో ఆన్ లైన్ లోవిరాళాలు సేకరించాలని  (క్రౌడ్‌ ఫండింగ్‌) చేయాలని ఆమె నిర్ణయించారు.  మార్పు కోసం రూ.10ఇవ్వాలంటూ ఆమె ప్రజల్ని కోరుతున్నారు. ప్రజల నుంచి రూ.10 వసూలు చేయటం ద్వారా జనాలకు మరింత దగ్గర రావటంతోపాటు.. ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకు రావటానికి సాయం చేస్తుందని ఆమె చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే దాకారూ. 4.5 లక్షల సేకరించారు.
 
ఎన్నికల కోసం ప్రజల నుంచి రూ.10 చొప్పున విరాళాలు వసూలు చేస్తున్నఏకైక ప్రాంతీయ రాజకీయ పార్టీ షర్మిలదనే చెబుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండటానికి.. వారి కష్టాల్ని తెలుసుకోవటానికి వీలుగా సైకిల్ మీదనే వెళ్లాలని భావిస్తున్నఆమె.. తన పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులందరిని సైకిల్ మీదనే ప్రచారం చేయాలని కోరటం గమనార్హం. మరి.. షర్మిల అడిగినట్లుగా రూ.10 విరాళాల ప్రోగ్రాం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతితో కాదు.. అమ్మతనంతో గెలిచిన జయలలిత