Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వృద్ధ తల్లిదండ్రులపై నోరు పారేసుకుంటే.. బిడ్డలను ఇంటి నుంచి గెంటేయొచ్చు : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టు గురువారం ఓ సంచలన తీర్పును వెలువరించింది. వృద్ధ తల్లిదండ్రులపై నోరు పారేసుకున్నట్టయితే, వారు నివశించే ఇంటి నుంచి కుమారుడైనా, కుమార్తెనైనా ఇంటి నుంచి గెంటేయవచ్చని ఢిల్లీ హైకోర్టు తాజాగా

వృద్ధ తల్లిదండ్రులపై నోరు పారేసుకుంటే.. బిడ్డలను ఇంటి నుంచి గెంటేయొచ్చు : ఢిల్లీ హైకోర్టు
, గురువారం, 16 మార్చి 2017 (15:49 IST)
ఢిల్లీ హైకోర్టు గురువారం ఓ సంచలన తీర్పును వెలువరించింది. వృద్ధ తల్లిదండ్రులపై నోరు పారేసుకున్నట్టయితే, వారు నివశించే ఇంటి నుంచి కుమారుడైనా, కుమార్తెనైనా ఇంటి నుంచి గెంటేయవచ్చని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ మేరకు తల్లిదండ్రుల సంక్షేమం, నిర్వహణ, సీనియర్ సిటిజన్స్ చట్టం 2007లోని నిబంధనలను ఉటంకిస్తూ జస్టిస్ మన్మోహన్ తీర్పు ఇచ్చారు. 
 
వృద్ధులు ప్రశాంతంగా వారి ఇంట్లో జీవించేందుకు, తమను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న కుమారుడితో కలసి ఉండే ఒత్తిడి చేయకుండా చూసేందుకు ఎవిక్షన్ ఆర్డర్ (పిల్లల్ని బయటకు పంపాలంటూ ఆదేశాలు) జారీ చేయవవ్చని జస్టిస్ మన్మోహన్ పేర్కొన్నారు. 
 
పిల్లలు పెద్దవారిని తిడితే తల్లిదండ్రులు వారిని భరించాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచి బయటకు పంపించే హక్కు ఉంటుందని జస్టీస్ మన్మోహన్ స్పష్టం చేశారు. కుమార్తె అయినా ఇదే వర్తిస్తుందని పేర్కొంది. సదరు తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు వారి సొంతది కాకపోయినా ఈ హక్కు ఉంటుందని స్పష్టత ఇచ్చింది. 
 
ఈ మేరకు చట్టంలో తగిన మార్పులు చేయాలని, అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. సుహృద్భావ సంబంధాలు ఉన్నంత వరకు, కుమారుడు భారంకానంతవరకూ తమతో కలసి ఉండేందుకు తల్లిదండ్రులు అనుమతించవచ్చని ఓ కేసు విచారణలో భాగంగా కోర్టు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ పని ఖతం : చుక్క నీరు వెళ్లకుండా నదులపై భారత ప్రాజెక్టుల నిర్మాణం