Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి ఇండియన్ పైలట్ అభినందన్.. ఆయన సాహసం అభినందనీయం

Advertiesment
తొలి ఇండియన్ పైలట్ అభినందన్.. ఆయన సాహసం అభినందనీయం
, ఆదివారం, 3 మార్చి 2019 (16:13 IST)
భారత రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి వచ్చిన పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చివేశాడు. ఈ మిషన్‌తో అతడు నేషనల్ హీరో అయిపోయాడు. అయితే అభినందన్ సాధించింది మామూలు ఘనతకాదని ఎయిర్ చీఫ్ మార్షల్ కృష్ణస్వామి అంటున్నారు. 
 
అసలు ఎఫ్-16 విమానాన్ని కూల్చేసిన తొలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంబాట్ పైలట్ అభినందన్ అని ఆయన గుర్తుచేశారు. అంతేకాదు మిగ్ -21లో వెళ్లి ఎఫ్-16ను కూల్చిన తొలి పైలట్ అతడే కావడం విశేషం. నిజానికి మిగ్-21 బైసన్ కూడా అత్యాధునిక ఫైటర్ జెట్ అయినా.. ఎఫ్-16కు ఇది ఏమాత్రం పోటిరాదని అయన ఆయన అన్నారు. ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్‌గా ఎఫ్-16కు పేరుంది. 
 
పాకిస్థాన్ ఈ అత్యాధునిక జెట్స్‌ను కొనుగోలు చేయడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూడా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. కనీసం 100 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని అడుగుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోయింది. మన ప్రభుత్వాల అలసత్వం వల్ల రక్షణకు సంబంధించిన ఏ సామాగ్రి కొనాలన్నా ఏళ్లకు ఏళ్ల సమయం పడుతున్నదని కృష్ణస్వామి ఆవేదన వ్యక్తంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభినందన్ అంటే ఇపుడు అర్థం వేరు : ప్రధాని నరేంద్ర మోడీ