Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశభక్తి చూపడానికి సల్మాన్ ఖాన్ సిగ్గుపడుతున్నారు: అభిజిత్ భట్టాచార్య

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ప్లేబ్యాక్ సింగర్ అభిజిత్ భట్టాచార్య విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ నటులపై నిషేధం విధించడం సరికాదనే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను శ్యామ్ బెనగల్‌, మహేష్‌భట్‌ తదితరులు స

Advertiesment
Abhijeet Bhattacharya accuses Salman Khan of supporting terrorism
, ఆదివారం, 2 అక్టోబరు 2016 (15:40 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ప్లేబ్యాక్ సింగర్ అభిజిత్ భట్టాచార్య విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ నటులపై నిషేధం విధించడం సరికాదనే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను శ్యామ్ బెనగల్‌, మహేష్‌భట్‌ తదితరులు సమర్థించారు. సమస్య అంతా పాక్‌ ప్రభుత్వంతోనని వారు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం సల్మాన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 
 
48గంటల్లో మా దేశం వదిలివెళ్లండి లేదంటే చాలా తీవ్రపరిణామాలను ఎదుర్కొంటారని పాక్‌ నటులకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అల్టిమేటం జారిచేసింది. యూరీ ఘటన నేపథ్యంలో స్పందించిన చిత్రపట్‌ కర్మచారి సేన పాకిస్థాన్‌ నటులను హెచ్చరించింది. కానీ ఈ విషయంలో బాలీవుడ్ నటులనుంచి మాత్రం వ్యతిరేకత వస్తుంది. కళకూ టెర్రరిజానికీ ముడి పెట్టవద్దని అంటున్నారు. 
  
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులకు మద్దతుగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే నిప్పులు చెరిగారు. పాక్‌ నటులు ఉగ్రవాదులు కారని, వారు వర్క్‌ పర్మిట్‌ వీసా తీసుకునే ఇక్కడకు వచ్చారని సల్మాన్‌ శుక్రవారం వ్యాఖ్యానించిన తరుణంలో 
 
పాకిస్థాన్‌ ప్రజలు చాలా మంచివారని తాను గతంలో కూడా చెప్పానని రాజ్‌థాక్రే అన్నారు. అలాంటి వారితో మనకెలాంటి సమస్యా లేదు గానీ అక్కణ్నుంచి ఉగ్రవాదులుగా మనముందుకు వస్తున్న వారితోనే సమస్య అని రాజ్ థాకరే అన్నారు. అయినా వందకోట్ల ప్రజలున్న ఈ దేశంలో టాలెంట్‌ ఉన్న నటులే దొరకనట్టు, పక్క దేశం వారిని ప్రోత్సహించడమేమిటని ఆయన అడిగారు. 
 
సల్మాన్ మెదడు అప్పుడప్పుడూ ట్యూబ్‌లైట్‌లాగా పనిచేస్తుందని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. దేశాన్ని, ప్రజలను కాపాడే క్రమంలోనే సైనికులు ప్రాణాలు విడిచారని, వారికి వ్యక్తిగతంగా పాక్‌తో ఎలాంటి వైరమూ లేదని, వారు ఎదుర్కొన్న బుల్లెట్లు సినిమాల్లో చూపించినట్టు నకిలీవి కావన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజామాబాద్ నెహ్రూ పార్కుకెళ్లాడు.. ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు.. సింహాలను భయపెట్టాడు.. ఆపై..?