ఇంటి పని కోసం వచ్చిన పదేళ్ల ఏళ్ల బాలికను వాతలు పెట్టి.. చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ ఒక మహిళా పైలట్, ఆమె భర్త, ఎయిర్‌మ్యాన్‌పై బాధితురాలి బంధువులు దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వీడియోలో, యూనిఫాంలో ఉన్న మహిళా పైలట్‌ను బాధితురాలి బంధువులుగా చెప్పబడుతున్న పలువురు సభ్యులు పదేపదే చెప్పుతో కొట్టారు. ఆమె తలపై కొట్టడంతో ఆమె సహాయం కోసం కేకలు వేస్తుంది. ఆమె భర్త కూడా దాడికి గురయ్యాడు. పదే పదే క్షమించమని ప్రార్థించాడు. భార్యను కూడా కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గుంపు దాడిని మాత్రం ఆపలేదు.
రెండు నెలల క్రితం, దంపతులు 10 ఏళ్ల బాలికను ఇంటి పని కోసం నియమించుకున్నారు. ఈరోజు, బాలిక చేతిపై గాయాలను చూసి బాలిక బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. బంధువులు బాలికను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు.
బాలిక చేతులపై, కళ్లకింద గాయాలను చూసిన జనం గుమిగూడి బాలికపై తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.