Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంబంధం పెట్టుకుని మధ్యలో వద్దంటావా.. వెయ్.. పొడిచేశాడు

రక్తం మరిగిన పులి వేట మానుతుందా.. వివాహేతర సంబంధాన్ని రుచిచూసిన మగాడు మధ్యలో వద్దు పోవోయ్ అంటే ఊరుకుంటాడా. అందులోనూ భారత మగాడు.. ఇష్టమున్నన్నాళ్లు తనతో సంబందం పెట్టుకుని అక్కర తీరిందని వదిలిస్తే ఆ మగాడికి నిజంగానే మండుకొచ్చింది. ఏం చేస్తున్నదీ తెలిని

Advertiesment
Fornication
హైదరాబాద్ , గురువారం, 6 జులై 2017 (06:35 IST)
రక్తం మరిగిన పులి వేట మానుతుందా.. వివాహేతర సంబంధాన్ని రుచిచూసిన మగాడు మధ్యలో వద్దు పోవోయ్ అంటే ఊరుకుంటాడా. అందులోనూ భారత మగాడు.. ఇష్టమున్నన్నాళ్లు తనతో సంబందం పెట్టుకుని అక్కర తీరిందని వదిలిస్తే ఆ మగాడికి నిజంగానే మండుకొచ్చింది. ఏం చేస్తున్నదీ తెలిని ఉన్మాదంలో వసతి గృహం ఆయానే పొడిచిపారేశాడు.
 
తమిళనాడులోని నెల్లై పట్టణంలో సాక్షాత్తూ ఇదే అంశంపై మర్డర్ జరిగిపోయింది. వివాహేతర సంబంధం ఓ మహిళను బలి తీసుకుంది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహించి ప్రియుడే ఆమెను కడతేర్చాడు. నెల్లై జిల్లా ముక్కుడలైకి చెందిన చంద్రశేఖర్‌ భార్య ఆనంది (38). వీరికి సుజీధరన్, అస్సుదన్‌ ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్‌ పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆనంది ఇద్దరు కుమారులతో ఉంటోంది. పేటైలో ఉన్న పిల్లల వసతిగృహంలో ఆనంది వంటమనిషిగా చేరింది.  వసతి గృహంలోనే ఉన్న ఓ గదిలో తన కుమారులతో ఉంటూ వంటపని చేసేది.
 
మంగళవారం ఉదయం వసతిగృహంలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఆనంది హాస్టల్‌లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తికి, ఆనందికి ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆనందిని కత్తితో నరికి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న నెల్లై టౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆనంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసుల విచారణలో ఆనందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ముక్కుడల్‌ సమీపంలో ఉన్న సింగమ్‌పాలైకి చెందిన చెల్లప్ప (50) ఈ హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేశారు.
 
ఆనంది భర్త చంద్రశేఖర్ తానూ స్నేహితులమని, చంద్రశేఖర్‌ మృతిచెందడడంతో ఆనందితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు చెల్లప్ప తెలిపాడు. కాగా,  ఆనంది వసతిగృహంలో వంటమనిషిగా చేరిన తరువాత చెల్లప్పతో మాట్లాడేది తగ్గించింది. దీంతో మంగళవారం ఉదయం హాస్టల్‌లోని పిల్లలు పాఠశాలకు వెళ్లిన తరువాత చెల్లప్ప హాస్టల్‌కి వెళ్లాడు. ఆనందితో తన కోరిక తీర్చమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన చెల్లప్ప ఆనందిని కత్తితో నరికి హత్య చేసినట్టు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్నకు చంద్రబాబు 20 లక్షల సహాయం