పగటి పూజ పూజారి.. పెళ్ళిళ్ల పేరయ్య వేషం.. రాత్రిపూట దోపిడీ దొంగ.. ఎక్కడ?
పగటి పూజ పూజారి.. రాత్రికాగానే దోపిడి దొంగగా మారే ఓ దుండగుడి బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. పూణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ పగలు బుద్ధవిహార్ సంరక్షకుడిగా ప్రజలకు ఆధ్యాత్మిక ప్రసంగాలు
పగటి పూజ పూజారి.. రాత్రికాగానే దోపిడి దొంగగా మారే ఓ దుండగుడి బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. పూణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ పగలు బుద్ధవిహార్ సంరక్షకుడిగా ప్రజలకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ సమాజంలో పెద్దమనిషిగా సుఖమయ జీవనం గడుపుతున్నాడు. రాత్రి కాగానే పగలు వల్లె వేసిన నీతి వాక్యాలు మరచి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నాడని పోలీసులు దర్యాప్తులో తేలిందని చెప్పారు.
ముంబయి, థానే పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో 25 దొంగతనాల్లో నిందితుడైన అజయ్ మధుకర్ గైక్వాడ్ (43) పోలీసు అరెస్ట్ చేసి.. దోపిడి చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుద్ధవిహార్ సంరక్షకుడిగా, పెళ్లిళ్ల పేరయ్య వేషంలో పగటిపూట పనిచేసే మధుకర్.. రాత్రి పూట దోపిడీలకు పాల్పడే వాడని పోలీసులు చెప్పుకొచ్చారు.
ఇంకా పాత దొంగలైన ఇషాక్ ముహమ్మద్ ఇక్బాల్ షేక్, మదన్ వీరన్ స్వామిల స్నేహం కారణంగానే సులభంగా డబ్బు సంపాదనకు మార్గంగా అజయ్ దొంగతనాలు ఎంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఐదేళ్ల పాటు ఈ దొంగతనాలు సాగుతుండేవని.. నిందితులను జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.